1920 Movie Collections: థియేటర్స్ లో కచ్చితంగా చూడాలి అనిపించే జానర్స్ లో ఒకటి హారర్ జానర్. ఈ జానర్ లో వచ్చే సినిమాలను కేవలం థియేటర్స్ లో మాత్రమే చూడాలి. అప్పుడే నిజమైన థ్రిల్లింగ్ అనుభూతి కలుగుతుంది. ఈమధ్య సరైన హారర్ సినిమాలు తగ్గాయి. అలాంటి సమయం లో ఈ సమ్మర్ లో విడుదలైన ‘విరూపాక్ష’ చిత్రం ప్రేక్షకులను భయపెట్టి ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఇచ్చిన ధైర్యం తోనే పలు హారర్ సినిమాలను తెలుగు లో కూడా దబ్ చేస్తున్నారు మేకర్స్.
అలా ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మహేష్ భట్ (అలియా భట్ తండ్రి) సమర్పణలో విక్రమ్ భట్ ప్రొడక్షన్స్ పై కృష్ణ భట్ దర్శకత్వం లో తెరకెక్కిన ‘1920 : హార్రర్స్ ఆఫ్ ది హార్ట్’ చిత్రాన్ని తెరకెక్కించారు. ‘ఉయ్యాలా జంపాల’ ఫేమ్ అవికా గోర్ ప్రధాన పాత్ర లో తెరకెక్కిన ఈ సినిమా నిన్న గ్రాండ్ గా తెలుగు మరియు హిందీ భాషల్లో విడుదలైంది. మరి ఈ చిత్రానికి ఎంత వసూళ్లు వచ్చాయో ఒకసారి చూద్దాము.
ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ఇండియా వైడ్ గా తెలుగు మరియు తమిళం భాషలకు కలిపి కేవలం కోటి 75 లక్షణాలు రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయట. ఇందులో తెలుగు వెర్షన్ కి 30 లక్షల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. షేర్ కనీసం పది లక్షలు కూడా ఉండకపోవచ్చు అని అంటున్నారు ట్రేడ్ పండితులు.
ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా రెండు కోట్ల రూపాయలకు జరిగింది. ఇప్పుడు మొదటి రోజు వచ్చిన వసూళ్లు చూస్తుంటే ఫుల్ రన్ లో ఈ సినిమా కనీసం 10 శాతం కూడా రికవర్ చేసేలా అనిపించడం లేదని అంటున్నారు ట్రేడ్ పండితులు.చిన్నారి పెళ్లి కూతురు అనే పాపులర్ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అవికా గోర్, ఉయ్యాలా జంపాల సినిమాతో పెద్ద హిట్ కొట్టి హీరోయిన్ గా కూడా స్థిరపడిపోయింది.ఆ తర్వాత ఈమెకి రెండు మూడు హిట్ సినిమాలు వచ్చేలోపు భవిష్యత్తులో ఈమె పెద్ద స్టార్ హీరోయిన్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ కథ అడ్డం తిరిగింది, సరైన ప్లానింగ్ లేకపోవడం తో ఈమెకి ఫ్లాప్స్ వచ్చాయి, అవకాశాలు తగ్గాయి, ఇప్పుడు ఈ సినిమా కూడా ఫ్లాప్ అవ్వడం తో ఇక అవికా గోర్ కెరీర్ ముగిసినట్టే అని అంటున్నారు విశ్లేషకులు.