Ravi Teja: సింగిల్ సిట్టింగ్ లో 100 కోట్లు.. పవన్ కళ్యాణ్ – ప్రభాస్ తర్వాత ఏకైక హీరోగా నిల్చిన రవితేజ!

ఈ సినిమా తర్వాత వెంటనే విడుదలైన 'వాల్తేరు వీరయ్య' చిత్రం కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం తో రవితేజ రేంజ్ మొత్తం మారిపోయింది. గతం లో 7 నుండి 10 కోట్ల రూపాయిల రేంజ్ రెమ్యూనరేషన్ తీసుకునే 'వాల్తేరు వీరయ్య' సినిమాకి ఏకంగా 17 కోట్ల రూపాయిలు రెమ్యూనరేషన్ తీసుకున్నాడు.

Written By: Vicky, Updated On : June 24, 2023 3:37 pm

Ravi Teja

Follow us on

Ravi Teja: మాస్ మహారాజ రవితేజ కి ప్రస్తుతం మహర్దశ నడుస్తుందనే చెప్పాలి. ఒకానొక దశలో వరుస ఫ్లాప్స్ తో కెరీర్ ఇక ముగిసిపోనుందా అనే రేంజ్ లో ఉండే రవితేజ కి క్రాక్ చిత్రం కొత్త ఊపిరి ని ఇచ్చింది. కానీ ఈ సినిమా తర్వాత ఆయనకీ వరుసగా ఫ్లాప్స్ వచ్చాయి, మార్కెట్ మళ్ళీ డౌన్ అయ్యింది.అలాంటి సమయం లో ఆయన నుండి విడుదలైన ‘ధమాకా’ చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యి, వంద కోట్ల రూపాయిల గ్రాస్ మరియు 50 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టింది.

ఈ సినిమా తర్వాత వెంటనే విడుదలైన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం తో రవితేజ రేంజ్ మొత్తం మారిపోయింది. గతం లో 7 నుండి 10 కోట్ల రూపాయిల రేంజ్ రెమ్యూనరేషన్ తీసుకునే ‘వాల్తేరు వీరయ్య’ సినిమాకి ఏకంగా 17 కోట్ల రూపాయిలు రెమ్యూనరేషన్ తీసుకున్నాడు.

అయితే ఇప్పుడు రవితేజ తో ‘ధమాకా’ వంటి సూపర్ హిట్ సినిమాని నిర్మించిన ‘పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థ, రవితేజ కి ఒక క్రేజీ ఆఫర్ ఇచ్చిందట.ఆయనతో ఒక నాలుగు సినిమాలు అగ్రిమెంట్ చేసుకున్నారట, ఈ నాలుగు సినిమాలకు గాను రవితేజ కి 100 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని ఇచ్చినట్టు సమాచారం. అంటే ఒక్కో సినిమాకి 25 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ అన్నమాట. ఈ వంద కోట్ల రూపాయిలు అగ్రిమెంట్ చేసిన మరుక్షణమే రవితేజ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేశారట నిర్మాతలు.

ఇలా సింగిల్ సిట్టింగ్ లో వంద కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకున్న హీరోలలో ఒకడిగా రవితేజ నిల్చిపోయాడు. గతం లో పవన్ కళ్యాణ్ మరియు ప్రభాస్ #OG మరియు ‘సలార్’ చిత్రాలకు ఇలా సింగిల్ సిట్టింగ్ లో రెమ్యూనరేషన్ ని అందుకున్నారు. ఇప్పుడు వాళ్ళ తర్వాత ఆ రేంజ్ రెమ్యూనరేషన్ ని అందుకున్నది ఒక్క రవితేజ మాత్రమే.ప్రస్తుతం రవితేజ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలో ‘ఈగల్’ అనే చిత్రం లో నటిస్తున్నాడు, ఇది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.