https://oktelugu.com/

Pushpa 2 : 23వ రోజు 1,50,000 టిక్కెట్లు..ఎంత వసూళ్లు రాబట్టిందో తెలిస్తే నోరెళ్లబెడుతారు..’పుష్ప 2′ ఖాతాలో మరో సంచలన రికార్డు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2 ' చిత్రం జోరు బాక్స్ ఆఫీస్ వద్ద ఏ మాత్రం తగ్గలేదు. విడుదలై 23 రోజులు పూర్తి అయ్యింది. పాన్ ఇండియా లెవెల్ అన్ని ఇండస్ట్రీస్ లోనూ పెద్ద సినిమాలు విడుదల అయ్యాయి.

Written By:
  • Vicky
  • , Updated On : December 28, 2024 / 12:53 PM IST

    Pushpa 2

    Follow us on

    Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2 ‘ చిత్రం జోరు బాక్స్ ఆఫీస్ వద్ద ఏ మాత్రం తగ్గలేదు. విడుదలై 23 రోజులు పూర్తి అయ్యింది. పాన్ ఇండియా లెవెల్ అన్ని ఇండస్ట్రీస్ లోనూ పెద్ద సినిమాలు విడుదల అయ్యాయి. కానీ ఒక్క చిత్రం కూడా ‘పుష్ప 2’ మేనియా ని బీట్ చేయలేకపోయింది. ఆడియన్స్ ఇప్పటికీ ‘పుష్ప 2 ‘ నే మొదటి ఛాయస్ గా పెట్టుకున్నారు. బుక్ మై షో యాప్ లో రోజుకి లక్షకు పైగా టిక్కెట్లు కేవలం మొదటి వారం లోనే అమ్ముడుపోయేవి. మొదటి వారం దాటిన తర్వాత రోజువారి లెక్కల్లో వర్కింగ్ డేస్ లో లక్షకు పైగా టిక్కెట్లు అమ్ముడుపోవడం ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. కేవలం ‘పుష్ప 2 ‘ విషయంలోనే మనం అది చూస్తున్నాం. నిన్న ఒక్క రోజే ఈ చిత్రానికి బుక్ మై షో యాప్ లో లక్ష 50 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయట.

    23 వ రోజు ఒక సినిమాకి ఈ స్థాయిలో టికెట్స్ అమ్ముడుపోవడం ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు, భవిష్యత్తులో కూడా ఈ రేంజ్ చూడడం కష్టం. తెలుగు కంటే ఎక్కువగా హిందీ వెర్షన్ లోనే వసూళ్లు వస్తున్నాయి. అమ్ముడుపోయిన 1,50,000 టికెట్స్ లో 70 శాతం హిందీ వెర్షన్ వే ఉంటాయి. ఆ స్థాయిలో దుమ్ము దులిపింది ఈ చిత్రం. ట్రేడ్ పండితుల అంచనా ప్రకారం ఈ సినిమాకి 23 వ రోజు 16 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయట. మొత్తం మీద ఇప్పటి వరకు 786 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు, 1716 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయని అంచనా వేస్తున్నారు. మరో 80 రూపాయలకు పైగా షేర్ వసూళ్లను ఈ చిత్రం రాబడితే ఫుల్ రన్ లో బాహుబలి 2 వరల్డ్ వైడ్ వసూళ్లను దాటినట్టే అని అంటున్నారు ట్రేడ్ పండితులు.

    బాహుబలి 2 చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 1800 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా దరిదాపుల్లోకి మళ్ళీ రాజమౌళి సినిమానే వెళ్లలేకపోయింది. అలాంటిది అల్లు అర్జున్ అవలీల గా దాటేలోపు ఇండస్ట్రీ మొత్తం షాక్ కి గురైంది. ఇంత దూరం వచ్చిన తర్వాత ఈ చిత్రం రెండు వేల కోట్ల రూపాయిల మార్కుని అందుకోకుంటే అసలు సంపూర్ణంగా ఉండదని అభిమానులు అనుకుంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ థియేటర్స్ లో ఈ చిత్రానికి మంచి రన్ ఉండడం తో సంక్రాంతికి కూడా దేశవ్యాప్తంగా గణనీయమైన థియేటర్స్ హోల్డ్ చేసి పెట్టారని, కచ్చితంగా ఈ చిత్రం అప్పటి వరకు భారీ వసూళ్లను నమోదు చేసుకుంటూ ఉంటుందనే నమ్మకం ఉందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. మరి ఈ చిత్రం ఆ రేంజ్ వసూళ్లను రాబడుతుందా లేదా అనేది చూడాలి.