Vivek Ramaswamy: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ 2025, జనవరి 20న బాధ్యతలు చేపట్టనున్నారు. ఎన్నికల్లో అమెరికన్లకే తొలి ప్రాధాన్యం అని, వలసవాదులను తరిమికొడతానని ట్రంప్ వాగ్దానం చేశారు. ఈ మేరకు ఆయన అడుగులు వేస్తున్నారు. బాధ్యతలు చేపట్టేనాటికి అన్నీ సెట్ చేసేలా కసరత్తు చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ వేదిక అమెరికాలో భారతీయ నిపుణుల నియామకాన్ని వ్యతిరేకిస్తోంది. ఆ నియామకాలు ఆపేయాలని డిమాండ్ చేస్తోంది. ఇలాంటి తరుణంలో భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త, అధ్యక్ష పదవికి పోటీపడిన వివేక్ రామస్వామి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కీలకంగా మారాయి. వివాదం రేపాయి. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోయే ట్రప్ భారతీయ అమెరికన్ వెంచర్ కేపిటలిస్ట్ శ్రీరాం కృష్ణను కృత్రిమ మేధ సీనియర్ విధాన సలహాదారుగా ఇటీవల నియమించడాని వేదిక విమర్శించింది. ఇవి అమెరికా ఫస్ట్ లక్ష్యాన్ని పక్కదాని పట్టిస్తాయని వేదిక భావిస్తోంఇ. కొందరు ఇమ్మిగ్రేషన్ విధానంతో చాలా మంది అవకాశాలు కోల్పోతున్నారని కొందరు వాదిస్తున్నారు.
రామస్వామి వాదన ఇలా..
ఇదిలా ఉంటే భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త వివేక్ రామస్వామి వాదన మరోలా ఉంది. అసలు సమస్య ఇమ్మిగ్రేషన్‌లో లేదని, అమెరికా సంస్కృతిలోనే ఉందని పేర్కొన్నారు. పిల్లల పెంపకంలో లోపం కారణంగానే అవకాశాలు రావడం లేదని ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. అమెరికన్ యువత సహజంగానే నైపుణ్య ఉందని, అయితే దానిని పెంపొందించడంలో వ్యవస్థాగతంగా విఫలమైందని పేర్కొన్నారు.
వారిని పొగుడుతుండడంతో..
గణిత మేధావులు, ఉన్నత విద్యావంతులను వదిలేసి అలంకార పదవుల్లో ఉన్నవారిని చాలా మంది పొగుడున్నారని వివేక్ పేర్కొన్నారు. ఈ సంస్కృతి కారణంగానే అవకాశాలు కోల్పోతున్నట్లు తెలిపారు. అదే సమయంలో వలసదారుల కుటుంబాలు తమ పిల్లలను విద్యారంగంలో నిష్ణాతులుగా మార్చి క్రమశిక్షణతో పెంచి పంపుతున్నారన్నారు. సామాజిక కార్యక్రమాలు, టీవీ చూడడం వంటివాటిపైనా ఆంక్షలు పెడుతుంటాయన్నారు. ఫలితంగా ఈ కుటుంబాల నుంచి నాయకుల తయారవుతున్నారని తెలిపారు. ఈ వ్యాఖ్యలపై మాగా(మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్) ఆగ్రహం వ్యక్తం చేసింది. వివేక్ వలసదారులకు, హెచ్–1బీ వీసాదారులకు అనుకూలంగా మాట్లాడుతున్నారని మాగా మండిపడుతోంది.