14 Reels Entertainment : పెద్ద సినిమాలను తియ్యడానికి నిర్మాతలు భయపడుతున్నారా..?, చిన్న సినిమాలతో, మంచి కథలతో తక్కువ బడ్జెట్ లో చేస్తే వచ్చే లాభాలే బెటర్ అని ఫీల్ అవుతున్నారా? అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. రీసెంట్ గా వరుసగా జరుగుతున్న కొన్ని సంఘటనలు చూస్తుంటే, భవిష్యత్తులో కొన్ని ప్రొడక్షన్ హౌస్లు మూత పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే పెట్టే బడ్జెట్ కి, జరుగుతున్న బిజినెస్ కి అసలు సంబంధం ఉండడం లేదు. సీనియర్ హీరోల సంగతి అలాగే ఉంది, పవన్ కళ్యాణ్, ప్రభాస్ లాంటి నేటి తరం సూపర్ స్టార్ సినిమాలకు కూడా అలాగే ఉంది. ఓజీ తర్వాత DVV సంస్థ ఇప్పట్లో పెద్ద సినిమాలు తియ్యను అని చెప్పినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ సినిమా 2022 వ సంవత్సరం లో మొదలైంది. పవన్ కళ్యాణ్ మధ్యలో రాజకీయాల్లో బిజీ అవ్వడం వల్ల రెండేళ్ల పాటు షూటింగ్ లేకుండా ఖాళీగా ఉండాల్సి వచ్చింది.
ఈ రెండేళ్లలో నిర్మాతకు వడ్డీలు తారా స్థాయిలో పెరిగాయి. సినిమా కమర్షియల్ గా పెద్ద సక్సెస్ అయ్యింది. కానీ లాభాలు మాత్రం అనుకున్నంత స్థాయిలో రాలేదు. ప్రభాస్ ‘రాజా సాబ్’ విషయం లో కూడా అదే జరిగింది. మూడేళ్ళ క్రితం మొదలైన ఈ సినిమా, అనేక కారణాల చేత వాయిదా పడుతూ వచ్చింది. వచ్చే నెలలో విడుదలయ్యే ఈ సినిమాకు ఇప్పటికీ పూర్తి స్థాయిలో VFX వర్క్ అవ్వలేదు. ఫలితంగా నిర్మాతకు బడ్జెట్ ఎవ్వరూ ఊహించని రేంజ్ లో పెరిగిపోయింది. దానికి మళ్లీ వడ్డీలు కూడా తోడు అయ్యాయి. విడుదలకు ముందే ఈ సినిమా నష్టాల్లో ఉంది. దీంతో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కూడా ఇక పై పెద్ద సినిమాలు చెయ్యకూడదు అని ఫిక్స్ అయ్యినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. ఇప్పుడు ఈ జాబితాలోకి 14 రీల్స్ సంస్థ కూడా వచ్చి చేరింది.
దూకుడు, లెజెండ్, సరిలేరు నీకెవ్వరూ సినిమాలు మినహా, ఈ బ్యానర్ నుండి వచ్చిన ప్రతీ సినిమా ఫ్లాప్ అయ్యింది. రీసెంట్ గా వీళ్ళు నిర్మించిన ఏజెంట్, భోళా శంకర్ చిత్రాలు తెచ్చిపెట్టిన నష్టాలు సాధారణమైనవి కాదు. మధ్యలో సామజవరగమనా అనే చిన్న సినిమా సక్సెస్ అయ్యింది కానీ, జరిగిన నష్టాలను మాత్రం పూడ్చలేదు. ఇప్పుడు అఖండ 2 విడుదలకు ఈ సంస్థ ఎన్ని ఆర్ధిక ఇబ్బందులు ఎదురుకుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. వాయిదా పడడం 30 శాతం కి పైగా బిజినెస్ కూడా పడిపోయింది. ఫలితంగా నిర్మాత ఇప్పుడు ఈ చిత్రాన్ని నష్టాలతోనే విడుదల చేస్తున్నాడు. నిర్మాత పెట్టిన బడ్జెట్ రీకవరీ అవ్వాలంటే, ఈ సినిమా థియేటర్స్ నుండి 150 కోట్ల షేర్ ని రాబట్టాలి. బాలయ్య కి అంత మార్కెట్ లేదు, సినిమాకు కావాల్సిన హైప్ కూడా క్రియేట్ అవ్వలేదు. దీంతో ఈ ఇక తమ బ్యానర్ లో పెద్ద సినిమాలు నిర్మించకూడదు అని 14 రీల్స్ సంస్థ నిర్ణయం తీసుకుందట. ‘అఖండ 2’ భారీ హిట్ అయితే కాస్త నిలబడే అవకాశాలు ఉన్నాయి, లేదంటే ఈ నిర్మాతలకు చిన్న సినిమాలను నిర్మించడం కూడా కష్టం అవుతుంది. మరి ఈ సినిమా ఫలితం ఏంటో మరో రెండు గంటల్లో తేలనుంది.