Bihar HIV Cases: సరిగ్గా రెండు దశాబ్దాల క్రితం మనదేశంలో హెచ్ఐవి అధికంగా ఉండేది. సురక్షితం కానీ శృంగారంలో పాల్గొనడం వల్ల చాలామంది హెచ్ఐవి బారిన పడేవారు. ఈ వ్యాధి వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అప్పట్లో ఐక్యరాజ్యసమితి హెచ్ఐవి మీద యుద్ధం ప్రకటించడంతో హెచ్ఐవి తగ్గుముఖం పట్టింది. ఇప్పటికి కూడా ప్రపంచవ్యాప్తంగా కొన్ని ప్రాంతాలలో హెచ్ఐవి కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. ఇక మనదేశంలో చూసుకుంటే హెచ్ఐవి కేసులు తగ్గుముఖం పడుతూనే ఉన్నప్పటికీ.. ఒక రాష్ట్రంలో మాత్రం రికార్డు స్థాయిలో హెచ్ఐవి కేసులు నమోదయ్యాయి.
సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఓ పోస్ట్ ప్రకారం.. మన దేశంలోని బీహార్ రాష్ట్రంలో ఓ జిల్లాలో 7,400 హెచ్ఐవి కేసులు నమోదయ్యాయి. ఇందులో 400 మంది చిన్నారులు కూడా ఉండడం విశేషం. 7400 హెచ్ఐవి బాధితులలో 3,544 మంది మహిళలు, 2,733 మంది పురుషులు ఉన్నారు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన పోస్ట్ విపరీతంగా సర్కులేట్ అవుతున్న నేపథ్యంలో రకరకాల చర్చలు మొదలయ్యాయి.. కొందరేమో ఒక మత ఆచారం ప్రకారం బీహార్ రాష్ట్రంలో నుదుటిమీద కత్తితో ఘాటు పెట్టుకుంటారని.. దీనివల్ల హెచ్ఐవి వ్యాప్తి చెంది ఉండవచ్చని అనుమానిస్తున్నారు. మరికొందరేమో ఈ వీడియో ఉత్తర ప్రదేశ్ లో తీసిందని.. దానిని అనవసరంగా బీహార్ రాష్ట్రానికి ఆపాదిస్తున్నారని వివరిస్తున్నారు.
వాస్తవానికి హెచ్ఐవి వ్యాప్తి అనేది కొంతకాలంగా మన దేశంలో తగ్గుముఖం పట్టింది. ఈ వ్యాధి పై ప్రభుత్వం విస్తృతస్థాయిలో అవగాహన కల్పిస్తోంది. మరోవైపు శృంగారం లో పాల్గొనేటప్పుడు చాలామంది రక్షణ విధానాలను పాటిస్తున్నారు. అందువల్ల హెచ్ఐవి వ్యాప్తి చాలావరకు తగ్గిపోయింది. అయితే సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్న పోస్ట్ ప్రకారం బీహార్ రాష్ట్రంలో ఈ వ్యాధి తీవ్రంగా ఉందని తెలుస్తోంది. అయితే దీనిపై ఇంతవరకు బీహార్ ప్రభుత్వం గానీ.. అక్కడి అధికారులు గాని ఎటువంటి అఫీషియల్ నోట్ విడుదల చేయలేదు.
బీహార్ రాష్ట్రం పరువు తీయడానికే కొంతమంది ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని అక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు. సోషల్ మీడియాలో తమ రాష్ట్రం మీద లేనిపోని దుష్ప్రచారాలు చేస్తున్నారని.. ఇది సరైన విధానం కాదని చెబుతున్నారు. బీహార్ వెనుకబడిన రాష్ట్రం అయినప్పటికీ.. ఇక్కడి ప్రజలమైన తాము అడ్డగోలు పనులు చేయమని చెప్తున్నారు. ప్రభుత్వం మాకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తోందని.. చివరి కి శృంగారం జరిపే విషయంలో కూడా తమకు ఒక అవగాహన ఉందని అక్కడి ప్రజలు అంటున్నారు.
బీహార్ రాష్ట్రం కొన్ని రంగాలలో వెనుకబడిపోయినప్పటికీ మిగతా వాటిల్లో అంత అడ్డగోలుగా లేదని అక్కడి ప్రజలు అంటున్నారు. అడ్డగోలు రోగాలను తెచ్చుకోవడానికి తాము సిద్ధంగా లేమని.. తాము నాగరికులమని.. అనాగరిక జీవితం గడిపే దౌర్భాగ్యం మాకు లేదని అక్కడి ప్రజలు అంటున్నారు. ఇప్పటికైనా తమమీద ఆరోపణలు చేసేవారు.. మరొకసారి పునరాలోచన చేసుకోవాలని బీహార్ ప్రజలు సూచిస్తున్నారు.