Actor Nithin : చాలా సినిమాలు మన టాలీవుడ్ లో అన్నీ మాట్లాడుకొని సెట్ చేసుకున్న తర్వాత మధ్యలో ఆగిపోయినవి ఉన్నాయి. అలాంటి ప్రాజెక్ట్స్ లో పాపం హీరో నితిన్(Actor Nithin) వే ఎక్కువ ఉంటాయి. అందుకు లేటెస్ట్ ఉదాహరణ ‘ఎల్లమ్మ’ అనే చిత్రం. ‘బలగం’ లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన వేణు, ఈ చిత్రాన్ని నితిన్ ని హీరో గా పెట్టి తియ్యాలని అనుకున్నాడు. దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాత. కానీ దిల్ రాజు ఈ సినిమాకు ముందు నితిన్ తో తీసిన ‘తమ్ముడు’ చిత్రం ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. దీంతో దిల్ రాజు నితిన్ ని ‘ఎల్లమ్మ’ నుండి తప్పించాడు. ఇదే తరహా అవమానం నితిన్ కి ‘తెలుసు కదా’ సినిమా విషయం లో కూడా జరిగిందట. ఈ చిత్ర దర్శకురాలు నీరజ కోన ముందుగా ఈ సినిమాని నితిన్ తో చెయ్యాలని అనుకుందట.
అతనికి వెళ్లి స్టోరీ చెప్పడం కూడా జరిగింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కడానికి రెడీ గా ఉన్న సమయం లో, బడ్జెట్ సమస్యలు తలెత్తాయి. అన్ని లెక్కలు వేసుకున్న తర్వాత నిర్మాత ‘నితిన్ తో ఇంత బడ్జెట్ సినిమా, ఆయన ప్రస్తుత మార్కెట్ కి వర్కౌట్ అవ్వదు’ అని ఆయన్ని ఈ సినిమా నుండి తప్పించారట. ఆ తర్వాత ఈ చిత్రం సిద్దు జొన్నలగడ్డ చేతుల్లోకి వెళ్ళింది. ఫలితం అందరికీ తెలిసిందే , అటు థియేటర్స్ లో సక్సెస్ అవ్వలేదు. ఇటు ఓటీటీ లో కూడా డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. దీన్ని బట్టీ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, సినిమాకు కావల్సినది బడ్జెట్ కాదు, కంటెంట్. ఆ కంటెంట్ లేకుండా ఏ హీరో తో సినిమా తీసినా డిజాస్టర్ ఫలితమే వస్తుంది. అందులోనూ నితిన్ ని తక్కువ అంచనా వేయడం ఏ మాత్రం సరికాదు అని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు.
ఎందుకంటే ‘సై’ చిత్రం తర్వాత వరుసగా 14 ఫ్లాపులు అందుకున్న నితిన్, తన సినిమాలను థియేటర్స్ లో కూడా విడుదల చేసుకోలేని పరిస్థితికి వచ్చాడు. అలాంటి సమయం లో ఆయన కంటెంట్ ని నమ్మి చేసిన చిత్రం ‘ఇష్క్’. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అవ్వడం, ఆ తర్వాత గుండెజారి గల్లంతయ్యిందే, అ..ఆ, హార్ట్ ఎటాక్, భీష్మ వంటి చిత్రాలతో మంచి మార్కెట్ ని క్రియేట్ చేసుకొని ఇండస్ట్రీ లో నిలబడ్డాడు. ఇప్పుడు మళ్లీ ఆయనకు వరుసగా ఆరు డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలు వచ్చాయి. ఆయన సినిమాలకు బిజినెస్ లు ఒకప్పటి లాగా జరగకపోవచ్చు గాక, కానీ మంచి కంటెంట్ తో తీస్తే కచ్చితంగా ళ్లీ భారీ కం బ్యాక్ ఇవ్వగలడు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.