https://oktelugu.com/

Bigg Boss 7 Telugu: మరోసారి రతిక సేఫ్… షాకింగ్ గా ఆ మేల్ కంటెస్టెంట్ అవుట్!

సోషల్ మీడియాలో జరిగే అనధికారిక పోలింగ్ ద్వారా ఒక అభిప్రాయానికి వస్తారు ఆడియన్స్. ఈ వారం శివాజీ, యావర్, గౌతమ్, రతిక, భోలే నామినేట్ అయ్యారు. శివాజీ మెజారిటీ ఓటింగ్ తో టాప్ లో ఉన్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : November 11, 2023 / 02:20 PM IST

    Bigg Boss 7 Telugu

    Follow us on

    Bigg Boss 7 Telugu: ప్రేక్షకుల ఓటింగ్ తో సంబంధం లేకుండా ఎలిమినేషన్ జరుగుతుందేమో అనిపిస్తుంది. బిగ్ బాస్ హౌస్లో లేడీ కంటెస్టెంట్స్ నలుగురు మాత్రమే ఉండగా… ఒక్కొక్కరిగా మేల్ కంటెస్టెంట్స్ ని ఇంటికి పంపిస్తున్నారు. ఈ వారం మరో మేల్ కంటెస్టెంట్ మీద ఎలిమినేషన్ కత్తి పడిందట. బిగ్ బాస్ షో అధికారిక ఓటింగ్ గురించి ఎవరికీ సమాచారం ఉండదు. నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయో తెలియదు.

    అయితే సోషల్ మీడియాలో జరిగే అనధికారిక పోలింగ్ ద్వారా ఒక అభిప్రాయానికి వస్తారు ఆడియన్స్. ఈ వారం శివాజీ, యావర్, గౌతమ్, రతిక, భోలే నామినేట్ అయ్యారు. శివాజీ మెజారిటీ ఓటింగ్ తో టాప్ లో ఉన్నారు. రెండో స్థానంలో యావర్, మూడో స్థానంలో భోలే, నాలుగో స్థానంలో గౌతమ్, ఐదో స్థానంలో రతిక ఉన్నట్లు మెజారిటీ పోల్స్ తేల్చాయి. దీంతో రతిక ఎలిమినేషన్ ఖాయం అనుకున్నారు.

    అనూహ్యంగా భోలేపై వేటు వేశారట. 10వ వారం భోలే ఇంటిని వీడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీనికి సంబంధించి షూటింగ్ కూడా పూర్తి అయ్యిందట. ఈ క్రమంలో రతిక మరోసారి సేవ్ అయ్యింది అంటున్నారు. నిజానికి హౌస్లో ఉన్న లేడీ కంటెస్టెంట్స్ లో శోభ, రతిక మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. నామినేషన్స్ లో కి వచ్చిన ప్రతిసారి శోభ ఓటింగ్ లో వెనుకబడుతుంది. కానీ ఆమె ఎలిమినేట్ కావడం లేదు.

    స్టార్ మా యాజమాన్యం శోభ అసలు నామినేషన్స్ లోకి రాకుండా ఫేవర్ చేస్తున్నారనే వాదన ఉంది. చూస్తుంటే శోభ, ప్రియాంకలను ఫైనలిస్ట్స్ గా స్టార్ మా ఫిక్స్ అయ్యారు. అమర్ దీప్ కూడా ఉంటాడు. స్టార్ మా బ్యాచ్ ముగ్గురితో పాటు శివాజీ, పల్లవి ప్రశాంత్ లను ఫైనల్ కి పంపాలని నిర్ణయించి ఉండొచ్చు. కాబట్టి రానున్న వారాల్లో అశ్విని, రతిక, గౌతమ్, అర్జున్, యావర్ లను ఎలిమినేట్ చేసే అవకాశం కలదు.