https://oktelugu.com/

100 Crore Club Movies: 100 కోట్లు కొల్లగొట్టిన బ్లాక్ బస్టర్ మలయాళ చిత్రాలు, డోంట్ మిస్… ఓటీటీలో ఎక్కడ చూడొచ్చంటే?

మలయాళ చిత్ర పరిశ్రమకు 100 కోట్లు అంటే అందని ద్రాక్ష. ఈ మధ్య స్టార్స్ లేని చిత్రాలు కూడా ఈ మార్క్ చేరుకుంటున్నాయి. అరుదైన 100 కోట్ల క్లబ్ లో చేరిన మలయాళ చిత్రాలు ఏవి?

Written By:
  • S Reddy
  • , Updated On : April 26, 2024 / 04:37 PM IST

    100 Crore Club Malayalam Blockbuster Movies

    Follow us on

    100 Crore Club Movies: మలయాళ చిత్ర పరిశ్రమ మార్కెట్ అంతకంతకు వ్యాపిస్తుంది. అద్భుతమైన కథలతో మలయాళ దర్శకులు బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేస్తున్నారు. తక్కువ బడ్జెట్ తో ఎక్కువ లాభాలు ఆర్జిస్తున్నారు. ఒకప్పుడు మలయాళ చిత్ర పరిశ్రమకు 100 కోట్లు అంటే అందని ద్రాక్ష. ఈ మధ్య స్టార్స్ లేని చిత్రాలు కూడా ఈ మార్క్ చేరుకుంటున్నాయి. అరుదైన 100 కోట్ల క్లబ్ లో చేరిన మలయాళ చిత్రాలు ఏవి? వాటిని ఏ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లో చూడొచ్చో తెలుసుకుందాం…

    1. పులి మురుగన్(2016)

    రూ. 100 కోట్ల రూపాయల వసూళ్లు సాధించిన మొదటి మలయాళ చిత్రం పులి మురుగన్. మోహన్ లాల్ హీరోగా నటించిన ఈ చిత్రంలో జగపతిబాబు ప్రధాన విలన్ పాత్ర చేశారు. వైసాక్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది. తెలుగులో మన్యం పులిగా విడుదలైంది.

    2. లూసిఫర్(2019)

    మోహన్ లాల్ నటించిన పొలిటికల్ థ్రిల్లర్ లూసిఫర్. వరుసగా రెండోసారి మోహన్ లాల్ రూ. 100 కోట్ల చిత్రాన్ని కోలీవుడ్ కి ఇచ్చారు. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. పృథ్విరాజ్ సుకుమారన్ ఈ చిత్ర దర్శకుడు కావడం విశేషం. వివేక్ ఒబెరాయ్, మంజు వారియర్, తోవినో థామస్ కీలక రోల్స్ చేశారు. తెలుగులో గాడ్ ఫాథర్ గా చిరంజీవి రీమేక్ చేశారు.

    3. 2018 మూవీ(2023)

    గత ఏడాది విడుదలైన స్మాల్ బడ్జెట్ మూవీ 2018. కేరళలో సంభవించిన వరదల ఆధారంగా తెరకెక్కించారు. ఈ మూవీ రూ. 100 కోట్ల వసూళ్లు రాబట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్య పరిచింది. తోవినో థామస్, తన్వి రామ్ హీరో హీరోయిన్స్ గా నటించారు. ఈ చిత్రం సోని లివ్ లో స్ట్రీమ్ అవుతుంది.

    4. ప్రేమలు(2024)

    రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ప్రేమలు కేరళ బాక్సాఫీస్ బద్దలు కొట్టింది. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ప్రేమలు వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. తెలుగులో విడుదలై ఇక్కడ కూడా ఆదరణ పొందింది. ప్రేమలు మూవీ తెలుగు వెర్షన్ ఆహాలో చూడొచ్చు. అలాగే హాట్ స్టార్ లో సైతం స్ట్రీమ్ అవుతుంది.

    5. మంజుమ్మెల్ బాయ్స్(2024)

    ఈ ఏడాది విడుదలైన మరొక సెన్సేషన్ తమిళ చిత్రం మంజుమ్మెల్ బాయ్స్. ఎలాంటి స్టార్ క్యాస్ట్ లేని ఈ చిత్రం అద్భుతం చేసింది. రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రం మే 3 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ కానుంది.

    6. ఆవేశం(2024)

    పుష్ప ఫేమ్ ఫహద్ ఫాజిల్ హీరోగా నటించిన ఆవేశం అద్భుత విజయం సొంతం చేసుకుంది. రూ. 100 కోట్లకు పైగా వసూళ్లతో ట్రేడ్ వర్గాలను ఆశ్చర్య పరిచింది. ఏఈ మూవీ డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. మే చివరి వారం నుంచి స్ట్రీమ్ కానుందని సమాచారం