
Gopichand Seetimaar : మాచో స్టార్ గోపీ చంద్, మిల్కీ బ్యూటీ తమన్నా హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘సీటీమార్’. మాస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ.. వినాయక చవితి శుభాకాంక్షలతో ఇవాళ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతోంది. అమెరికాలో ఇప్పటికే ప్రీమియర్స్ పడ్డాయి. ఈ సినిమా ఫారెన్ లో చూసిన వారు తమ అభిప్రాయాన్ని ట్విటర్ ద్వారా తెలియజేస్తున్నారు. మరి, ఆ రివ్యూలు ఎలా ఉన్నాయి? స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రం కప్పు కొట్టిందా? లేదా? అసలు సినిమా ఎలా ఉంది? అనే విషయాన్ని చూద్దాం.
ఈ మూవీ.. హీరోహీరోయిన్లతోపాటు దర్శకుడికి సైతం చాలా కీలకంగా ఉంది. ఒక సాలిడ్ హిట్ కోసం హీరో గోపీ చంద్ చాలా కాలంగా వెయిట్ చేస్తున్నాడు. ఇటు తమన్నా కెరీర్ కూడా మరోసారి బౌన్స్ బ్యాక్ అవ్వాలంటే.. ఈ విజయం చాలా అవసరం. ఇక, దర్శకుడు సంపత్ నందికి ఎంత అవసరమో చెప్పాల్సిన పనిలేదు. దాదాపు పదేళ్ల క్రితం రామ్ చరణ్ తో ‘రచ్చ’ చేసిన తర్వాత.. ఆ స్థాయి విజయం దక్కలేదు. దీంతో.. ఈ ముగ్గురూ ఈ చిత్ర విజయం భారీ ఆశలే పెట్టుకున్నారు.
సీటీమార్ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. ఎప్పుడో పూర్తయిన ఈ చిత్రం కరోనా కారణంగా ఆలస్యంగా థియేటర్లను తాకింది. ఈ చిత్రం కబడ్డీ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కింది. మన దేశంలో.. క్రీడారంగంలో మహిళల పాత్ర ఇప్పటికీ తక్కువే. ఇక, ఎలాంటి అవకాశాలూ లేని గ్రామీణ ప్రాంతంలోని యువతుల పరిస్థితి ఎలా ఉంటుందో తెలిసిందే. అలాంటి వారిని ఛాంపియన్లుగా ఎలా నిలిచారన్నదే ఈ చిత్రం కథగా చెబుతున్నారు.
ఇటు గోపీచంద్, అటు తమన్నా ఇద్దరూ కోచ్ లుగా ఉన్నారు. ఏపీ యువతుల కబడ్డీ జట్టుకు గోపీచంద్, తెలంగాణ అమ్మాయిల కబడ్డీ జట్టుకు తమన్నా కోచ్ గా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని వారి ఆర్థిక పరిస్థితుల కారణంగా.. క్రీడారంగం వైపు పంపించే తల్లిదండ్రులు చాలా తక్కువగా ఉంటారు. వారిని మోటివేట్ చేసి, పిల్లలను కబడ్డీ వైపునకు తీసుకెళ్తారట గోపీచంద్, తమన్నా. ఇలాంటి చిత్రాల్లో.. విషయం ముందే తెలిసిపోతుంది కాబట్టి.. కథనం ఎంతగా ఆకట్టుకుంది అన్నదానిపైనే చిత్ర విజయం ఆధారపడి ఉంటుంది.
ఆ విధంగా చూసుకున్నప్పుడు ట్విటర్ రివ్యూలో సీటీ మార్ కు పాజిటివ్ టాక్ వస్తోంది. కబడ్డీ థీమ్ ఆద్యంతం ఆసక్తికరంగా నిలిచిందని ట్వీట్లు చేస్తున్నారు ఆడియన్స్. ఇక, గోపీచంద్, తమన్నా మధ్య లవ్ రొమాన్స్ కథలో భాగం చేశారని చెబుతున్నారు. ఓవరాల్ గా మంచి సినిమా అవుతుందని ట్విటర్ రివ్యూ చెబుతోంది. మరి, పూర్తి రివ్యూ ఎలా ఉంటుందన్నది మరికొన్ని గంటల్లో తేలిపోతుంది. దానికోసం ‘ఓకే తెలుగు’ను చూస్తూ ఉండండి.