కింగ్ నాగార్జున ఉగాది పండుగ రోజున ‘బంగార్రాజు’గా పలుకరించబోతున్నాడు. నాగార్జున ‘సొగ్గాడే చిన్నినయనా’ మూవీలో బంగార్రాజుగా ప్రేక్షకులను మెప్పించిన సంగతి తెల్సిందే. తెలుగుదనం ఉట్టిపడేలా పంచెకట్టులో నాగార్జున నటన ఆకట్టుకుంది. ఈ మూవీ హిట్టయిన తర్వాత దర్శకుడు కల్యాణ్ కృష్ణ సీక్వెల్ ప్లాన్ చేశాడు. ఈ సినిమాలోని బంగార్రాజు క్యారెక్టర్ ను ఇన్పిరేషన్ గా తీసుకొని ఓ కథను దర్శకుడు సిద్ధం చేశాడు. ఈ కథకు నాగార్జున గతంలోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఇప్పటివరకు పట్టాలెక్కలేదు. అయితే తాజా సమాచారం మేరకు ‘బంగార్రాజు’ మూవీ ఉగాది రోజున ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.
కింగ్ నాగార్జున ప్రస్తుతం ‘వైల్డ్ డాగ్’ మూవీ చేస్తున్నాడు. యదార్థ సంఘటన ఆధారంగా కొత్త దర్శకుడు అహిషోర్ సోలోమన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇటీవల హైదరాబాద్లో పూర్తి చేసుకొంది. ఈ మూవీకి సంబంధించిన ఫస్టు లుక్, పోస్టర్లు ఆకట్టుకున్నాయి. ఈ మూవీని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డిలు నిర్మిస్తున్నారు. ఈ మూవీ తర్వాత నాగార్జున ‘బంగార్రాజు’ మూవీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో నాగార్జున తనయుడు నాగ చైతన్య కూడా నటించనున్నారని ప్రచారం జరుగుతుంది.
సొగ్గాడు చిన్నినాయనా తర్వాత ఈ మూవీకి సీక్వెల్ ఎప్పుడు వస్తుందోనని నాగార్జున అభిమానులు అత్రుతగా వెయిట్ చేస్తున్నారు. అయితే గతకొంతకాలంగా ఈ మూవీపై ఎలాంటి సమాచారం లేకపోవడంతో స్వీకెల్ రాదోమోనని భావించారు. అయితే అందరి ఆలోచనలను తలకిందులు చేస్తూ ‘బంగార్రాజు’ ఉగాదికి రాబోతున్నాడు. ఈ చిత్ర షూటింగ్ ఉగాది రోజున ప్రారంభించేందుకు దర్శకుడు కల్యాణ్ కృష్ణ సన్నహాలు చేస్తున్నారు.