ప్రఖ్యాత బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్ జాబితాలో ఫిదా బ్యూటీ సాయిపల్లవి చోటు దక్కించుకొంది. 30ఏళ్లలోపు వివిధ రంగాల్లో విజయాలు సాధించిన ప్రముఖుల పేర్లను ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రచురించింది. ఈ జాబితాలో 27ఏళ్ల సాయిపల్లవి సినిమా రంగం నుంచి చోటు సంపాదించి అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో సాయిపల్లవి అభిమానులు ఈ వార్తను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
తెలుగులో వరుణ్ సందేశ్ తో కలిసి సాయిపల్లవి అందరినీ ‘ఫిదా’ చేసింది. ఈ మూవీలో నటనకు ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు కూడా అందుకుంది. ఈ మూవీ హిట్టు తర్వాత తెలుగులో క్రేజీ హీరోయిన్ గా మారింది. ఆమె తమిళ, మళయాళ భాషల్లో బీజీగా ఉన్నప్పటికీ తెలుగు మూవీల్లో అడుపదడుప కన్పిస్తూ మురిపించింది. నానితో కలిసి ‘మిడిక్లాస్ అబ్బాయి(ఎంసీఏ)’ లో నటించింది. అలాగే శర్వానంద్ తో కలిసి ‘పడిపడిలేచే మనస్సు’ మూవీలో నటించింది. సాయిపల్లవి డాన్స్ కు చాలా ఫాలోవర్స్ ఉన్నారు. ధనుష్ తో కలిసి నటించిన ‘మారి-2’లోని రౌడీ బేబీ పాట యూబ్యూబ్లో రికార్డులు సృష్టించింది. ధనుస్ తో కలిసి సాయిపల్లవి చేసిన డాన్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుంది. ఈ యూట్యూబ్లో కొత్త రికార్డు సృష్టించిన సంగతి తెల్సిందే. ఇటీవల సూర్యతో నటించిన ‘ఎన్జీకే’ మూవీ సాయిపల్లవికి అనుకున్నంత విజయం అందించలేదు. దీంతో మళ్లీ తెలుగు సినిమాల్లో నటిస్తూ బీజీగా అవుతోంది.
ప్రస్తుతం సాయిపల్లవిలో తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటిస్తుంది. ఈ మూవీలో నాగ చైతన్యకు జోడిగా నటిస్తుంది. అలాగే రానాతో కలిసి ‘విరాటపర్వం’ అనే మూవీలో నటిస్తుంది. ఈ మూవీలో రానా ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఈ మూవీకి వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నాడు. నటన, డాన్స్ తో కోట్లాది ఫ్యాన్స్ ను అలరిస్తున్న సాయిపల్లవి ప్రస్తుతం ఫోర్బ్స్ మ్యాగజైన్ జాబితాలో చోటు దక్కించుకోవడంతో ఆమె అభిమానులకు ఖుషీ అవుతున్నారు.