
తమన్నా పక్కా బిజినెస్ విమెన్. ఫలానా ఫలానా స్టార్స్ తో మాత్రమే చేస్తాను, వీళ్ళతో చెయ్యను, అలాంటి సినిమాలు చెయ్యను లాంటి కండిషన్స్ లేని సీనియర్ హీరోయిన్. రెమ్యునరేషన్ ఎక్కువ ఇస్తే చాలు. హీరో ఎవరు ? అతని ట్రాక్ రికార్డ్ ఏమిటి వంటివి అసలు చూడడు. ఈ క్రమంలోనే యంగ్ హీరో సత్యదేవ్ తో ఓ సినిమా ఒప్పుకుంది, సినిమా పేరు ‘గుర్తుందా శీతాకాలం’.
పేరుకి తగ్గట్టుగానే సినిమా కూడా మంచి రొమాంటిక్ సినిమా. కన్నడలో సూపర్ హిట్ గా నిలిచిన ‘లవ్ మాక్‌టైల్’కు ఇది రీమేక్. నాగశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ రొమాంటిక్ కథా నేపథ్యంలో కొన్ని బోల్డ్ సీన్స్ ఉన్నాయి. అయితే ఈ సీన్స్ ను కొంచెం ఘాటుగా తెరకెక్కించాలని, అల చేస్తేనే డిజిటల్ రైట్స్ ను కాస్త పెద్ద మొత్తంలో అమ్ముకోవచ్చు అనేది దర్శకనిర్మాతల అభిప్రాయం.
అందుకే, తమన్నాని తీసుకునే ముందే.. బోల్డ్ సీన్స్ గురించి చెప్పి తీసుకున్నారు. సత్యదేవ్ లాంటి అప్ కమింగ్ హీరోతో రొమాన్స్ కాబట్టి, రెమ్యునరేషన్ ఎక్కువ ఇవ్వండి అంటూ డిమాండ్ చేసి మరీ, ఈ సినిమాకు గాను రెండు కోట్లు వరకూ పుచ్చుకుందట మిల్కీ బేబీ. కరోనా సెకెండ్ వేవ్ తగ్గినా తరువాత తమన్నా ఆ రొమాంటిక్ సన్నివేశాలలో నటించనుంది.
ఈ క్రమంలో చిత్ర బృందానికి ఒక కండిషన్ పెట్టింది. ముందుగానే తనతో పాటు సత్యదేవ్ కూడా కరోనా టెస్ట్ చేయించుకుని, పదిహేను రోజులు పాటు సేపరేట్ గా ఉండాలని, అప్పుడే తానూ రోమాన్స్ కి రెడీ అని, అలాగే సత్యదేవ్ లాంటి హీరోతో లిప్ కిస్ చేస్తే తన ఇమేజ్ కి డ్యామేజ్ అని, అందుకే అదనపు రేమ్యునరేషన్ ఇవ్వాలని మళ్ళీ తమన్నా నిర్మాతను కోరిందట. ఘాటు సీన్స్ కాబట్టి నిర్మాత కూడా ఓకే అని అన్నాడని తెలుస్తోంది.