
ప్రముఖ కథా రచయిత కాళీపట్నం కారా మాస్టారు కన్నుమూశారు. శ్రీకాకులళంలోని ఆయన నివాసంలో ఉదయం 8.20 గంటలకు తుది శ్వాస విడిచారు. కాళీపట్నం వెంట రామ సుబ్రహ్మణ్మేశ్వరావు కారా మాస్టారుగా సుపరిచితులు. ఈయన రాసిన రచనలు తక్కువైనా ప్రాచుర్యం పొందాయి. 1966 లో ఆయన వ్రాసిన యాజ్ఞం కథలు తెలుగు పాఠకుల విశేష మన్ననలు పొందాయి. దోపిడీ స్వరూప స్వభావాలను సరళంగా, సహజంగా శాస్త్రీయంగా చిత్రీకరించగా 1995 సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు.