ఒంటరిగా తులసి ఇదంతా ఎలా జరిగింది అని ఆలోచిస్తుంది. వెంటనే తనకు పురుషోత్తం మాటలు గుర్తుకు రావడంతో పురుషోత్తం ని ఎలాగైనా పట్టుకోవాలని అనుకుంటుంది. లాస్య వచ్చి పురుషోత్తం గురించి ఆలోచిస్తున్నావ్ అంటూ ఇదంతా చేసింది నేనే అంటూ నిజం చెప్పే సరికి తులసి కూడా నువ్వే చేసావ్ అని నాక్కూడా తెలుసు అంటుంది. అలా వారిద్దరి మధ్య కాసేపు మాటల యుద్ధం జరుగుతుంది. నువ్వు నష్టపరిహారం కట్టకపోతే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని చెప్పడంతో తులసి కూడా చివరకు లాస్య కి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది.మరోవైపు జీకే దగ్గరికి అందులో పనిచేసే ఉద్యోగి వచ్చి వారికి కేసు బెయిల్ ఇచ్చారు అంటూ చెప్పేసరికి మరింత కోపం అవుతాడు.
ఇక తమ దగ్గరకు ముందుగానే కొన్ని పంపిన మెటీరియల్స్ ఉన్నాయి అంటూ చెప్పేసరికి వెంటనే జీకే వాటిని రిటర్న్ తీసుకోవాలి అని హెచ్చరిస్తాడు. మీ వల్ల కాకపోతే నేను కూడా గట్టిగా వార్నింగ్ ఇస్తానంటూ జీకే అంటాడు. ఆ ఉద్యోగి తులసి దగ్గరికి వచ్చి తమ మెటీరియల్ వాపస్ కోరడంతో తులసి అందుకు ఒప్పుకోదు. కావాలంటే మీ సార్ దగ్గరికి వచ్చి మాట్లాడతాను అని అనేసరికి కారులో ఉన్న జీకే తులసి చూసి గతంలో తులసి ఒక్కరిని ఎదిరించిన విషయాన్ని తలచుకొని ఈ డైనమిక్ లేడీ ఇక్కడ ఉంది ఏంటి అని ఆశ్చర్యపోతాడు.ఇక తులసి జీకే దగ్గరికి వెళ్లగా జీకే తులసితో గౌరవంగా మాట్లాడుతాడు. ఇక తులసి ఇదంతా తన వల్ల జరిగిన తప్పు కాదని తన ఎంప్లాయ్ వల్ల జరిగిన తప్పు అని చెప్పడంతో జీకే ఆమె మాటలు నమ్మి మరింత గౌరవిస్తాడు. ఇక ఇటువంటి ఎంప్లాయిస్ ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటూ సలహా ఇస్తాడు. అంతేకాకుండా కేస్ వాపస్ తీసుకుంటాను అంటూ నమ్మకం ఇస్తాడు జీకే.