‘హీరో రామ్’ హీరోగా హిట్ అయి ఏళ్ళు గడిచిపోయినా ఇంకా స్టార్ హీరోగా చలామణి కాలేకపోతున్న ఓ మంచి హీరో. విజయ్ దేవరకొండ లాంటి హీరో కూడా వచ్చిన హిట్ ను వాడుకొని సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేసుకుని స్టార్ హీరో అనిపించుకుంటున్నా.. రామ్ మాత్రం ఎప్పుడూ అలా చేయలేదు. కొన్ని సినిమాల్లో ఓవర్ యాక్షన్ చేశాడు గాని, బయట మాత్రం మములు యాక్షనే చేస్తున్నాడు. పైగా మంచి వ్యక్తి అనే ట్యాగ్ లైన్ కూడా సంపాధించుకున్నాడు. ఇక ‘ఇస్మార్ట్ శంకర్’ లాంటి సూపర్ హిట్ తరువాత రామ్, ప్రస్తుతం కిషోర్ తిరుమల దర్శకత్వంలో రెడ్ సినిమాతో బిజీగా ఉన్నాడు.
కేసీఆర్ తో ప్రత్యక్ష యుద్ధానికి తమిళిసై రె’ఢీ’?
అయితే తనకు మంచి హిట్ మూవీ ఇచ్చిన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కోసం , పూరి కుమారుడు ఆకాష్ పూరి హీరోగా చేస్తోన్న ‘రొమాంటిక్’ సినిమా కోసం రామ్ వాయిస్ ఓవర్ చెబుతున్నాడు. ఈ రోజు ప్రసాద్ ల్యాబ్ లో రామ్ వాయిస్ ఓవర్ చెబుతున్నట్లు తెలుస్తోంది. రామ్ వాయిస్ ఫుల్ ఎనర్జీ.. అలాంటి రామ్ వాయిస్ తో రొమాంటిక్ మొదలు కాబోతుందంటే ఖచ్చితంగా సినిమాకి ప్లస్ అవుతుంది. కాగా కొత్త దర్శకుడు అనిల్ పాదూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కూడా పూరి నిర్మిస్తున్నారు. కొడుకు కోసం పూరి చేస్తున్న మరో రిస్క్ ప్రాజెక్టు ఇది.
ఫెయిలైనా విద్యార్థులకు గుడ్ న్యూస్..!
మాఫియా నేపథ్యంలో ఓ ప్రేమ కథగా రాబోతున్న ఈ సినిమాలో సీనియర్ హాట్ బ్యూటీ రమ్యకృష్ణ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే ఆకాశ్ పూరి సరసన కేతికా శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. మరి ఈ సినిమాతోనైనా ఆకాష్ పూరి హిట్ కొడతాడా.. లేక మళ్లీ ప్లాప్ తో తండ్రికి నష్టాలను మిగులుస్తాడా అనేది చూడాలి. అన్నట్టు మాజీ బబ్లీ హీరోయిన్ ఛార్మి కూడా పూరి జగన్నాథ్ సాన్నిహిత్యంలో పూరి టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాల పై ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.