కేసీఆర్ తో ప్రత్యక్ష యుద్ధానికి తమిళిసై రె’ఢీ’?

మామూలుగా గవర్నర్ అంటే ఉత్సవ విగ్రహంలా అన్ని రాష్ట్రాల్లో ఉంటారు. కాంగ్రెస్ హయాంలో రాజ్ భవన్ కదిలేవారు కాదు.. కానీ బీజేపీ హయాంలోని గవర్నర్లు మాత్రం తమ ప్రత్యర్థి పార్టీలను ఈ గవర్నర్లతోనే దెబ్బతీస్తున్నారు. గవర్నర్లను చోదక శక్తిగా ఉపయోగించుకొని ఇప్పటికే కర్ణాటక, మధ్యప్రదేశ్, హిమాచల్ , రాజస్థాన్ సహా పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్, ఇతర ప్రభుత్వాలను కూల్చి బీజేపీ ప్రభుత్వాలను గద్దెనెక్కిస్తున్నారు. భారతీయులకు గుణపాఠం చెప్పిన ట్రంప్ ఈ పరంపరలోనే ఎన్నికల వేళ ప్రధాని మోడీని […]

Written By: NARESH, Updated On : June 25, 2020 1:53 pm
Follow us on


మామూలుగా గవర్నర్ అంటే ఉత్సవ విగ్రహంలా అన్ని రాష్ట్రాల్లో ఉంటారు. కాంగ్రెస్ హయాంలో రాజ్ భవన్ కదిలేవారు కాదు.. కానీ బీజేపీ హయాంలోని గవర్నర్లు మాత్రం తమ ప్రత్యర్థి పార్టీలను ఈ గవర్నర్లతోనే దెబ్బతీస్తున్నారు. గవర్నర్లను చోదక శక్తిగా ఉపయోగించుకొని ఇప్పటికే కర్ణాటక, మధ్యప్రదేశ్, హిమాచల్ , రాజస్థాన్ సహా పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్, ఇతర ప్రభుత్వాలను కూల్చి బీజేపీ ప్రభుత్వాలను గద్దెనెక్కిస్తున్నారు.

భారతీయులకు గుణపాఠం చెప్పిన ట్రంప్

ఈ పరంపరలోనే ఎన్నికల వేళ ప్రధాని మోడీని ఎదురించిన తెలంగాణ సీఎం కేసీఆర్ పై నజర్ పెట్టిన మోడీషాలు ఆయనపై బలమైన తమిళనాడు బీజేపీ నేత తమిళిసైని రంగంలోకి దించారు. తెలంగాణకు గవర్నర్ గా పెట్టారు. రాగానే టీఆర్ఎస్ ప్రభుత్వ లూప్ హోల్స్, వివిధ కార్యక్రమాల్లో వేలు పెట్టి హల్ చల్ చేసిన తమిళ్ సై ఆరు నెలలుగా సైలెంట్ గా ఉన్నారు. కరోనా ప్రభావం కూడా దానికి కారణం.

తాజాగా మళ్లీ గవర్నర్ తమిళ్ సై జూలు విదులుస్తున్నారు.టీఆర్ఎస్ సర్కార్ ను షేక్ చేస్తున్నారు. గులాబీ నేతలకు చమటలు పట్టిస్తున్నారు. గవర్నర్ తమిళ్ సై ఈ కరోనా టైంలోనూ ప్రజలను కలువడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాకుండా వివిధ తెలంగాణ సమస్యలపై ఆమె స్పందిస్తోంది. ఇటీవలే సోషల్ మీడియాలో యోగా వీక్ ను నిర్వహించింది.

ఫెయిలైనా విద్యార్థులకు గుడ్ న్యూస్..!

తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గవర్నర్ తమిళ్ సై గాంధీ ఆసుపత్రిని సందర్శించి వైద్య సిబ్బందితో మాట్లాడారు. కేసీఆర్ సర్కార్ ఇంకా ఎక్కువ చేయాల్సిన అవసరం ఉందని ఆమె విమర్శించడం దుమారం రేపింది. తక్కువ కరోనా పరీక్షలు చేయడంపై కూడా కేసీఆర్ సర్కార్ పై అసంతృప్తిని వ్యక్తం చేసింది.

ఇక కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వానికి పోటీగా గవర్నర్ ఏకంగా పీఎం కేర్స్ కు విరాళాలను స్వీకరించడం తాజాగా చర్చనీయాంశమైంది. కోవిడ్ వైరస్ పై పోరాడడానికి ఒంటరిగా విరాళాలు స్వీకరిస్తున్న గవర్నర్ తీరు కేసీఆర్ పై ప్రత్యక్ష దాడిగానే టీఆర్ఎస్ శ్రేణులు పరిగణిస్తున్నారు.

తాజాగా కరోనాపై బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలాయి. కేసీఆర్ వైఫల్యంపై కిషన్ రెడ్డి, బీజేపీ నేతలు విమర్శించగా.. ప్రధాని మోడీ అసంబద్ద విధానాలు, లాక్ డౌన్ ల సడలింపుల వల్లే ఇలా జరిగిందని టీఆర్ఎస్ మంత్రులు ఎదురుదాడి చేశారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాపై మంత్రి ఈటల హరీష్ రావులు విరుచుకుపడ్డారు. ఈ క్రమంలోనే తమిళ్ సై కేసీఆర్ సర్కార్ కు వ్యతిరేకంగా చర్యలు చేపడుతుండడం వేడి పుట్టిస్తోంది.