https://oktelugu.com/

మనోజ్ వర్కౌట్స్ వర్కౌట్ అవుతాయా ?

‘మంచు మనోజ్’ స్టార్ హీరో అవ్వాల్సిన హీరో. బ్యాగ్రౌండ్ తో పాటు టాలెంట్ ఉన్న హీరో. కానీ సరైన సినిమా పడలేదు. ఇప్పటివరకు సరైన డైరెక్టర్ కూడా పడలేదు. మొత్తానికి అన్నీ ఉన్నా మనోజ్ కి కాలం కలిసి రాలేదు. మొదటి సినిమా నుండి మనోజ్ ప్లానింగ్ మిస్ ఫైర్ అవుతూనే వచ్చింది. మధ్యలో ప్రయోగాలు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. దీనికి తోడు మనోజ్ పర్సనల్ లైఫ్ కూడా కాస్త డిస్టర్బ్ అవ్వడం, కొన్నాళ్లు పాటు సినిమాలు […]

Written By: , Updated On : June 4, 2021 / 07:37 PM IST
Follow us on

‘మంచు మనోజ్’ స్టార్ హీరో అవ్వాల్సిన హీరో. బ్యాగ్రౌండ్ తో పాటు టాలెంట్ ఉన్న హీరో. కానీ సరైన సినిమా పడలేదు. ఇప్పటివరకు సరైన డైరెక్టర్ కూడా పడలేదు. మొత్తానికి అన్నీ ఉన్నా మనోజ్ కి కాలం కలిసి రాలేదు. మొదటి సినిమా నుండి మనోజ్ ప్లానింగ్ మిస్ ఫైర్ అవుతూనే వచ్చింది. మధ్యలో ప్రయోగాలు చేసినా ఎవరూ పట్టించుకోలేదు.

దీనికి తోడు మనోజ్ పర్సనల్ లైఫ్ కూడా కాస్త డిస్టర్బ్ అవ్వడం, కొన్నాళ్లు పాటు సినిమాలు కూడా మానేయడం మొత్తమ్మీద మనోజ్ మార్కెట్ పూర్తిగా పడిపోయింది. ఈ లోపు మనోజ్ ఓవర్ వెయిట్ అయిపోయాడు. కానీ, ఇప్పుడు మనోజ్ పూర్తిగా తన కెరీర్ మీద దృష్టి పెట్టి వర్కౌట్స్ చేస్తున్నాడు. ఈ లాక్ డౌన్ లో కొత్త లుక్ కోసం కసరత్తులు చేస్తున్నాడు.

కాగా తన ఫిజిక్ ను పూర్తిగా మార్చడానికి కఠినమైన వర్కవుట్ లు చేసి, మనోజ్ దాదాపు 18 కిలోల బరువు తగ్గినట్టు తెలుస్తోంది. కేవలం అధిక లావు కారణంగానే మనోజ్ కొన్ని పాత్రలకు మాత్రమే ఇన్నాళ్లు పరిమితం అవుతూ వచ్చాడు. అందుకే, ఇక నుండి స్మార్ట్ గా స్లిమ్ గా కనిపిస్తేనే.. అన్ని పాత్రలకు సెట్ అవుతాననే ఆలోచనతో ఆయుర్వేదిక్ డైట్ పాటిస్తూ కఠినమైన వ్యాయామం చేశాడట.

ప్రస్తుతం మనోజ్ ‘అహం బ్రహ్మాస్మి’ అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకి నిర్మాత కూడా మనోజే. అప్పులు చేసి మరీ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. అందుకే ఎంత హార్డ్ వర్క్ చేసైనా ప్రేక్షకులను ఫిదా చేయాలనే కసితో ఈ సినిమా కోసం తనను తానూ మార్చుకుంటూ… మళ్లీ కెరీర్‌ పై ఫుల్ ఫోకస్ పెట్టాడు. ఇక మనోజ్ మరో రెండు సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. మరి మనోజ్ వర్కౌట్స్ వర్కౌట్ అవుతాయా ?