ఆ చానెల్ అధినేతకు ఇంటి పోరట!

వీ6 న్యూస్ చానెల్ అధినేత, మాజీ ఎంపీ గడ్డం వివేక్ వెంకట్ స్వామి తెలంగాణలో కింగ్‌పిన్‌గా ఎదగడానికి ప్రయత్నిస్తున్నారు. టీఆర్ఎస్ లో దళితుడిని సీఎం చేస్తే ఈయనే సీఎం అవుతారని ఆశించారు. కానీ కేసీఆర్ ముందర ఆయన ఆశలు నెరవేరలేదు. పోయిన సారి టికెట్ కూడా ఇవ్వకపోవడంతో బీజేపీలో చేరారు. ఇప్పుడు బీజేపీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే ఆయన ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయట.. పెద్దపల్లి ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన వివేక్ వెంకట స్వామిని నాయకులు అసలు […]

Written By: NARESH, Updated On : June 4, 2021 7:16 pm
Follow us on

వీ6 న్యూస్ చానెల్ అధినేత, మాజీ ఎంపీ గడ్డం వివేక్ వెంకట్ స్వామి తెలంగాణలో కింగ్‌పిన్‌గా ఎదగడానికి ప్రయత్నిస్తున్నారు. టీఆర్ఎస్ లో దళితుడిని సీఎం చేస్తే ఈయనే సీఎం అవుతారని ఆశించారు. కానీ కేసీఆర్ ముందర ఆయన ఆశలు నెరవేరలేదు. పోయిన సారి టికెట్ కూడా ఇవ్వకపోవడంతో బీజేపీలో చేరారు. ఇప్పుడు బీజేపీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే ఆయన ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయట..

పెద్దపల్లి ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన వివేక్ వెంకట స్వామిని నాయకులు అసలు పట్టించుకోవడం లేదని.. నియోజకవర్గానికే ఆహ్వానించలేదట. ఇటీవల ఉత్తర తెలంగాణలో బీజేపీ భవిష్యత్తు గురించి చర్చించడానికి సమావేశం నిర్వహించారు. దీనికి ఆయనను ఆహ్వానించకపోవడం బీజేపీలో చిచ్చు రేపింది..

మంచిర్యాలలోని బీజేపీ సీనియర్ నాయకుడు మల్లారెడ్డి నివాసంలో ఈ సమావేశం జరిగినట్టు భోగట్టా. ఈ సమావేశంలో మాజీ మంత్రి బోడా జనార్ధన్, మాజీ ఎమ్మెల్యేలు సోమరపు సత్యనారాయణ, గుజ్జుల రామకృష్ణారెడ్డి, పార్టీ ఇన్‌ఛార్జిలు రామగుణం, బెల్లాంపల్లి, మంతాని, ధర్మపురి వంటి ముఖ్య నాయకులు పాల్గొన్నారు. కోల్ బెల్టులో బిజెపి అవకాశాలపై చర్చించడానికి ఈ సమావేశం జరిగినప్పటికీ, బిజెపి ఎంపీ అభ్యర్థి, మాజీ ఎంపీ జి వివేక్ ను ఈ కీలక సమావేశానికి ఆహ్వానించలేదు. వివేక్ వారిని అస్సలు పట్టించుకోకపోవడంతో ఈ నాయకులు అసంతృప్తితో ఉన్నారని వర్గాలు తెలిపాయి. కొత్త నేత ఈటల కు అనుకూలంగా వివేక్ ఉంటూ తమను విస్మరించడమే కాక, తమకు ప్రతి కూలంగా కొత్త కేడర్‌ను సృష్టిస్తోన్నరని వారు ఆరోపిస్తున్నారు.

వివేక్ ఆయా నియోజకవర్గాల్లో పర్యటించేటప్పుడు తమకు సమాచారం కూడా ఇవ్వడం లేదని ఈ నాయకులు ఆరోపించారు. అతను తన వ్యక్తిగత అభివృద్ది కోసం పనిచేస్తున్నాడని, పార్టీ అభివృద్ధి కోసం కాదని వారు భావిస్తున్నారు. పార్టీ రాష్ట్ర నాయకత్వానికి లిఖితపూర్వక ఫిర్యాదు చేయడానికి కూడా వారు యోచిస్తున్నట్లు సమాచారం. కాబట్టి వివేక్‌కు బీజేపీలో ఇప్పుడు ఇంటిపోరుతో కొంత ఇబ్బంది కలుగుతోందని చెప్పాలి. అతను దీన్ని ఎలా ఎదురుకుంటాడో చూద్దాం.