బాలయ్య వెంట ఏజెంట్ ఆత్రేయ

బాలకృష్ణ – బోయపాటి శ్రీను కలయికలో వస్తున్న మూడో సినిమాలో దర్శకుడు బోయపాటి శ్రీను ఎమోషన్స్‌కు పెద్దపీట వేస్తున్నట్టు తెలుస్తోంది మాస్ ఆడియన్స్ తో పాటు ,ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమాను ఎంజాయ్ చేసేలా బోయపాటి తగిన శ్రద్ద తీసుకొంటున్నట్టు తెలుస్తోంది.. ఇక ఈ చిత్రం లో బాలయ్యకు ప్రక్కనే ఎప్పుడు వుండే క్యారెక్టర్ ఒకటుందట…. అయితే ఆ పాత్ర కోసం పలువురిని అనుకోని చివరకు ఓ యంగ్ హీరో ను సెలెక్ట్ చేశారట…గత సంవత్సరం […]

Written By: admin, Updated On : April 27, 2020 2:44 pm
Follow us on


బాలకృష్ణ – బోయపాటి శ్రీను కలయికలో వస్తున్న మూడో సినిమాలో దర్శకుడు బోయపాటి శ్రీను ఎమోషన్స్‌కు పెద్దపీట వేస్తున్నట్టు తెలుస్తోంది మాస్ ఆడియన్స్ తో పాటు ,ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమాను ఎంజాయ్ చేసేలా బోయపాటి తగిన శ్రద్ద తీసుకొంటున్నట్టు తెలుస్తోంది.. ఇక ఈ చిత్రం లో బాలయ్యకు ప్రక్కనే ఎప్పుడు వుండే క్యారెక్టర్ ఒకటుందట…. అయితే ఆ పాత్ర కోసం పలువురిని అనుకోని చివరకు ఓ యంగ్ హీరో ను సెలెక్ట్ చేశారట…గత సంవత్సరం ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమాలో డిటెక్టివ్ గా కనిపించి అందరి మన్ననలు అందుకున్న ‘నవీన్‌ పొలిశెట్టి’ ఇపుడు బాలయ్య పక్కన కీలక పాత్రలోనటించ బోతున్నాడు. కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని `జయ జానకి నాయక ` ఫేమ్ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి తన ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ ఫై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంగీత సంచలనం తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం లో బాలకృష్ణ మరోసారి ద్విపాత్రాభినయం చేయబోతున్నాడు కాగా అందులో ఒక పాత్ర అఘోరా కావడం విశేషం .

ఇప్పటికే ఈ చిత్రం తాలూకా మొదటి షెడ్యూల్ పూర్తి కాగా..లాక్ డౌన్ కారణంగా షూటింగ్ కు బ్రేక్ పడింది. బోయపాటి – బాలకృష్ణ కలయికలో ` సింహ , లెజెండ్ `వంటి చిత్రాలు వచ్చి భారీ హిట్స్ కావడం తో ఈ మూడో చిత్రం ఫై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. .