ఫుట్ బోర్డుపై ఆకాష్ లిప్ లాక్..

దర్శకుడు పూరి జగన్మాథ్ తనయుడు ఆకాష్ పూరి ‘రోమాంటిక్’ మూవీలో నటిస్తున్నాడు. రోమాంటిక్ ఎంటటైన్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీకి పూరి జగన్మాథ్ శిష్యుడు అనిల్ పూడురి దర్శకత్వం వహిస్తున్నాడు. మంగళవారం ‘రోమాంటిక్’ మూవీ విడుదల తేదిని చిత్రబృందం ప్రకటించింది. మే 29న విడుదల చేస్తున్నట్లు పోస్టర్ విడుదల చేసింది. ఈ పోస్టర్ చూస్తే అందరు అవాక్కవాల్సిందే. హీరో ఆకాష్ బస్సు ఫుట్ బోర్డుపై హీరోయిన్ పెదాలను ఆమాంతం జుర్రుకుంటుూ కనిపిస్తున్నాడు. హీరోయిన్ కి ఘాటైన లిప్ […]

Written By: Neelambaram, Updated On : February 11, 2020 6:59 pm
Follow us on

దర్శకుడు పూరి జగన్మాథ్ తనయుడు ఆకాష్ పూరి ‘రోమాంటిక్’ మూవీలో నటిస్తున్నాడు. రోమాంటిక్ ఎంటటైన్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీకి పూరి జగన్మాథ్ శిష్యుడు అనిల్ పూడురి దర్శకత్వం వహిస్తున్నాడు. మంగళవారం ‘రోమాంటిక్’ మూవీ విడుదల తేదిని చిత్రబృందం ప్రకటించింది. మే 29న విడుదల చేస్తున్నట్లు పోస్టర్ విడుదల చేసింది. ఈ పోస్టర్ చూస్తే అందరు అవాక్కవాల్సిందే. హీరో ఆకాష్ బస్సు ఫుట్ బోర్డుపై హీరోయిన్ పెదాలను ఆమాంతం జుర్రుకుంటుూ కనిపిస్తున్నాడు. హీరోయిన్ కి ఘాటైన లిప్ లాక్ చేసే దృశ్యం ప్రేక్షకులను అటూ వైపు లాగుతుంది. ఇంకేముందీ ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

ఆకాష్ పూరి హీరోగా నిలదొక్కుకునేందుకు శాయశక్తుల ప్రయత్నిస్తున్నాడు. అయితే ఆకాష్ కి సరైన హిట్టు దక్కడం లేదు. దర్శకుడు పూరి జగన్మాథ్ తన కుమారుడిని హీరోగా నిలబెట్టేందుకు తీసిన ‘మెహబూబా’ అనుకున్నంత సక్సస్ కాలేదు. దీంతో ఈసారీ ఎలాగైన భారీ సక్సస్ అందుకోవాలనే ప్లాన్ తో ‘రోమాంటిక్’ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీకి పూరి జగన్మాథ్ కథ, మాటలు అందిస్తున్నాడు. ఈ మూవీ బాధ్యతలను పూరి జగన్నాథ్ తన శిష్యుడు అనిల్ కు అప్పగించాడు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ఫస్టు లుక్, టీజర్, పోస్టర్ వంటివి విపరీతంగా ఆకట్టుకున్నాయి. నేడు విడులైన పోస్టర్ ను చూస్తే ‘రోమాంటిక్’ మూవీలో రోమాన్స్ డోస్ కొంచెం ఎక్కువగా ఉండనుందని తెలుస్తోంది.

‘రోమాంటిక్’ మూవీలో ఆకాష్ పూరికి జోడిగా కితిక శర్మ నటిస్తుంది. ఈ భామ కూడా ‘రొమాంటిక్’ మూవీలో రెచ్చిపోయి నటించినట్లు తెలుస్తోంది. సునిల్ కశ్యప్ అదిరిపోయే సంగీతాన్ని అందిస్తున్నాడు. రమ్యకృష్ణ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీని పూరి జగన్మాథ్ తో కలిసి ఛార్మి నిర్మిస్తున్నారు. ‘రొమాంటిక్’ మూవీ ఇప్పటికే చివరి దశకు చేరుకుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మే 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీతో ఆకాష్ పూరి భారీ సక్సస్ అందుకుంటాడో లేదో చూడాలి.