వివాదాస్పద నటి శ్రీరెడ్డి మళ్లీ సీన్లోకి వచ్చింది. క్యాస్టింగ్ కౌచ్ వివాదాన్ని తెరపైకి తెచ్చిన శ్రీరెడ్డి.. గతంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి రచ్చ రచ్చ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చెన్నైకి మకాం మార్చేసిన శ్రీరెడ్డి సినీ అవకాశాలతో బిజీ బిజీగా వుంది. అయినా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంది. తాజాగా శ్రీరెడ్డి జనసేన ఎమ్మెల్యే రాపాక గురించి ఓ పోస్టు చేసింది.
తన ఫేస్‌బుక్ ఖాతాలో ఎమ్మెల్యే రాపాక వరప్రసాద రావుపై ఆసక్తికరమైన కామెంట్లు చేసింది. ”రాపాక మీరు కేక” అంటూ పోస్టు చేసింది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన వికేంద్రీకరణ బిల్లుకు రాపాక వరప్రసాదరావు అసెంబ్లీలో మద్దతు పలకడాన్ని శ్రీరెడ్డి స్వాగతించింది.
Read More: అమరావతిలో తెల్లరేషన్ కార్డు ఉండి వందల ఎకరాల భూములు కొన్నవారిపై సిఐడి విచారణ
ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లులను వ్యతిరేకించాలని, ఒకవేళ దానిపై ఓటింగ్ నిర్వహిస్తే అందుకు బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలంటూ పవన్ కళ్యాణ్ రాపాక వరప్రసాద్‌కు బహిరంగ లేఖ రాశారు. అయితే, అధినేత లేఖను లైట్ తీసుకున్న రాపాక వరప్రసాద్ తాను మాత్రం వికేంద్రీకరణ బిల్లుకు మద్దతిస్తున్నట్టు ప్రకటించారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే శ్రీరెడ్డి రాపాక వరప్రసాద్ మీద ”రాపాకా.. మీరు కేక” అని కామెంట్ పోస్ట్ చేసింది.
Read More: ప్రియుడిని చంపి శవాన్ని తింటూ వీడియో తీసిన పోర్న్ స్టార్