Homeఎంటర్టైన్మెంట్'నాన్నకు ప్రేమతో'.. కూతురి టాలెంట్ చూసి షాక్ అవుతున్న సుకుమార్

‘నాన్నకు ప్రేమతో’.. కూతురి టాలెంట్ చూసి షాక్ అవుతున్న సుకుమార్

 

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ తన రైటింగ్, మేకింగ్ టాలెంట్ తో అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాడు. ఇప్పుడు ఆయన కూతురు సుకృతి తన సింగింగ్ టాలెంట్ తో షాకిస్తోంది. జనవరి 11న సుకుమార్ 50వ పుట్టినరోజు వేడుకులు జరుపుకున్నారు.

 

ఈ సందర్భంగా సుకుమార్ కుమార్తె సుకృతి ఆయన కోసం ఓ పాట పాడి తన తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. అయితే నేడు సుకృతి పుట్టినరోజుని పురస్కరించుకొని ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ ట్విట్టర్ వేదికగా సుకృతి పాడిన పాట వీడియోను పోస్ట్ చేశారు.

 

‘డార్లింగ్ డైరెక్టర్ సుకుమార్ ముద్దుల కుమార్తె సుకృతికి పుట్టినరోజు శుభాకాంక్షలు. తండ్రి పుట్టినరోజు కోసం తాను పాడిన పాటని.. నేడు ఆమె పుట్టినరోజు సందర్భంగా విడుదల చేస్తున్నాం. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని భావిస్తున్నాను’ అని దేవిశ్రీ తన సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.

 

సుకృతి పాట విన్న నెటిజన్లు ఆమె టాలెంట్ ని పొగుడుతూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. తన వాయిస్ అధ్బుతంగా ఉందని పొగుడుతున్నారు. ప్రస్తుతం సుకుమార్.. అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమా రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా కనిపించనుంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Tollywood Directors: బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేసే ఉద్దేశ్యం లేని తెలుగు దర్శకులు వీళ్లే…

Tollywood Directors: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లు కొందరు తెలుగు హీరోలు అవకాశం ఇవ్వకపోవడంతో బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ముఖ్యంగా వంశీ పైడిపల్లి తెలుగు స్టార్...

Vemulawada Rajanna Temple: వేములవాడకు తండ్రి 7 లక్షల విరాళం.. తిరిగివ్వాలని కూతుళ్ల పోరాటం.. ఊహించని ట్విస్ట్

Vemulawada Rajanna Temple: తెలంగాణలో ప్రముఖ శైవ క్షేత్రాలలో అత్యంత ప్రసిద్ధి చెందింది వేములవాడ రాజేశ్వర ఆలయం. ఇక్కడ స్వామి వారు లింగం రూపంలో ఉంటారు. ఈ ఆలయంలో కోడె మొక్కులను చెల్లించడం...

Football Legends Retirement: దిగ్గజాల నిష్క్రమణ.. పుట్ బాల్ చరిత్రలో ముగిసిన స్వర్ణయుగం

Football Legends Retirement: ప్రపంచంలో అత్యధిక ఆదరణ పొందిన క్రీడ ఫుట్బాల్. అందుకే ఫిఫా ప్రపంచ కప్ కు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. పైగా ఇది క్రీడల్లోకెల్లా అత్యధిక స్థాయిలో వీక్షణలు సొంతం...

US Iran Conflict: అమెరికా డేటా సెంటర్ పై దాడి.. ముదిరిన యుద్ధం

US Iran Conflict: గల్ఫ్‌ ప్రాంతంలో అమెరికా, ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా మారాయి. రెండు దేశాలు పరస్పరం దాడులు, ప్రతీకార చర్యలతో పశ్చిమాసియా మొత్తం అగ్నిగుండంలా మారింది. వాణిజ్య నౌకల రాకపోకలకు...

FIFA World Cup Revenue: ఫిఫా ప్రపంచ కప్.. ఎన్ని వేల కోట్లు వచ్చాయో తెలుసా..

FIFA World Cup Revenue: ఈ ప్రపంచంలో అత్యంత ప్రజాధరణ పొందిన క్రీడలలో ఫుట్ బాల్ ముందు వరుసలో ఉంటుంది. దీనిని ప్రపంచంలో మెజారిటీ దేశాలు ఆడుతూ ఉంటాయి. అంతర్జాతీయ ఫుట్...
Oktelugu Epaper
Exit mobile version