https://oktelugu.com/

కరోనా.. వారినే ఎక్కువ బాధ పెడుతుంది !

చూస్తుండగానే ఈ సంవత్సరం మన జీవితాల్లో అత్యంత చేదు సంవత్సరంగా మిగిలిపోబోతుంది. ముఖ్యంగా సినిమా వాళ్లకు ఈ సంవత్సరం ఎప్పటికీ మర్చిపోలేని కష్టం. ఒక విధంగా సినిమా పుట్టిన దగ్గర నుండి ఇలాంటి పరిస్థితిని ఎన్నడూ సినిమా వాళ్ళు ఎదుర్కోలేదు. ఎక్కడో చైనాలో పుట్టి ప్రపంచానికే ప్రమాదకరంగా మారిన ఈ కరోనా వైరస్‌.. అందరి కంటే సినీ కార్మికులనే ఎక్కువ బాధ పెట్టింది. సినిమానే నమ్ముకుని బతికే కార్మికులకు మరో పని రాదు. దాంతో వాళ్ళు కూలీ […]

Written By: , Updated On : September 16, 2020 / 04:02 PM IST
Follow us on


చూస్తుండగానే ఈ సంవత్సరం మన జీవితాల్లో అత్యంత చేదు సంవత్సరంగా మిగిలిపోబోతుంది. ముఖ్యంగా సినిమా వాళ్లకు ఈ సంవత్సరం ఎప్పటికీ మర్చిపోలేని కష్టం. ఒక విధంగా సినిమా పుట్టిన దగ్గర నుండి ఇలాంటి పరిస్థితిని ఎన్నడూ సినిమా వాళ్ళు ఎదుర్కోలేదు. ఎక్కడో చైనాలో పుట్టి ప్రపంచానికే ప్రమాదకరంగా మారిన ఈ కరోనా వైరస్‌.. అందరి కంటే సినీ కార్మికులనే ఎక్కువ బాధ పెట్టింది. సినిమానే నమ్ముకుని బతికే కార్మికులకు మరో పని రాదు. దాంతో వాళ్ళు కూలీ పనులకు కూడా పోలేని పరిస్థతి. పోయినా, మరో బాధాకరమైన విషయం ఏమిటంటే.. వారిని ఎవ్వరూ పనిలోకి కూడా తీసుకోవడం లేదట.

Also Read: బిగ్ బాస్4: గంగవ్వపై కుట్రలు చేస్తున్నారా..?

అలవాటు లేని పని కావడం.. సరిగ్గా పని చేయడం లేదనే కారణంగా సినీ కార్మికులకు బయట పనులు దొరకడం లేదు. బతుకు బండిని కరోనా కోరలకు బలి చేయకుండా తమను తాము కాపాడుకునే అవకాశం కూడా లేకుండా పోయింది వారికి. సినీ కార్మికులను అత్యంత బాధ పెట్టే వారి సంఘటనల గురించి విటుంటే.. వారి కన్నీటి మరకలను తుడిచి.. కనీసం వాళ్ళు పస్తులతో సావాసం చెయ్యకుండా ఎవరైనా ఆర్ధిక సహాయం చేసి ఆదుకుంటే బాగుండు. కానీ ఎవరు చేస్తారు, ఎంతని చేయగలరు. మొదటిసారి ఇలాంటి క్లిష్ట పరిస్థితులను ఎలా ఫేస్ చేయాలో.. ఈ కష్ట కాలాన్ని ఎలా నెట్టుకురావాలో అర్ధం కాక సినీ పెద్దలే చేతులెత్తేస్తోన్న క్రమంలో ఇప్పుడు కార్మికుల కోసం ఎవరు మాత్రం ఏమి చేయగలరు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Also Read: శ్రావణి కేసు రిమాండ్ రిపోర్ట్: నిర్మాత అశోక్ రెడ్డి అరెస్ట్

అంటే ఇక సినిమాని నమ్ముకుని బతుకుతున్న బతుకులకు ఈ సంవత్సరం అంతా ఇక ఎలాంటి భరోసా లేదనే అనుకోవాలేమో. అందరికీ పని దొరికేలా షూటింగ్ లు పూర్తి స్థాయిలో ఎప్పుడూ మొదలు అవుతాయో తెలీదు. కానీ అందరి ఆశ మాత్రం వచ్చే సంక్రాతినే. కరోనా మహమ్మారి జనవరితో పోతుందని మరో నాలుగు నెలలు కష్టాలు పడినా.. మళ్లీ మంచి రోజులు వస్తాయని సినీ కార్మికులు ఆశతో ఉన్నారు. మరి వారి ఆశ నేరవేరుతుందా చూడాలి.