https://oktelugu.com/

అరె.. టాలెంటెడ్ బ్యూటీలో డైరెక్షన్ స్కిల్ !

హీరోయిన్ నివేత థామస్ లో మరో స్కిల్ కూడా ఉంది, అదే డైరెక్షన్. తానూ ఎప్పటికైనా డైరక్టర్ అవుతానంటోంది ఈ క్యూట్ బ్యూటీ. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నివేత థామస్, మధ్యలో కొన్నాళ్లు డైరెక్షన్ కోర్సు కూడా చేసింది. అయితే స్వతహాగా మంచి నటి కావడంతో అమ్మడుకు ఎక్కడా గ్యాప్ రాలేదు. పైగా నటించడానికి స్కోప్ ఉండే పాత్రలు వస్తుండటంతో డైరెక్షన్ వైపు మళ్ళీ తొంగి చూడలేదు. ఇప్పటివరకు నివేత చేసిన పాత్రలు […]

Written By: , Updated On : May 29, 2021 / 07:17 PM IST
Follow us on

హీరోయిన్ నివేత థామస్ లో మరో స్కిల్ కూడా ఉంది, అదే డైరెక్షన్. తానూ ఎప్పటికైనా డైరక్టర్ అవుతానంటోంది ఈ క్యూట్ బ్యూటీ. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నివేత థామస్, మధ్యలో కొన్నాళ్లు డైరెక్షన్ కోర్సు కూడా చేసింది. అయితే స్వతహాగా మంచి నటి కావడంతో అమ్మడుకు ఎక్కడా గ్యాప్ రాలేదు. పైగా నటించడానికి స్కోప్ ఉండే పాత్రలు వస్తుండటంతో డైరెక్షన్ వైపు మళ్ళీ తొంగి చూడలేదు.

ఇప్పటివరకు నివేత చేసిన పాత్రలు అన్నీ ఆమెకు నటిగా మంచి గుర్తింపు తెచ్చినవే. అయితే భవిష్యత్తులో ఎలాగైనా దర్శకత్వం వహిస్తానని అంటుంది నివేత. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రస్తుతానికి నేను నటినే, ఇంకా మంచి పాత్రలు చేయాలి. అయితే నాకు డైరెక్షన్ అంటే చాలా ఇష్టం. కానీ నన్ను ఎవరూ పిలిచి నన్ను డైరక్షన్ చేయమంటూ నాకు ఛాన్స్ ఇవ్వరు అని తెలుసు.

నాకు నేనుగా డైరక్షన్ ఛాన్స్ ను సంపాదించుకోవాలి. అయితే నాకు వెంటనే మూవీ డైరక్షన్ కోసం ప్రయత్నాలు చేయాలని లేదు. ముందుగా నాకు తెలిసిన సబ్జెక్టుతో కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేయాలని ఉంది. అలా షార్ట్ ఫిల్మ్స్ నుండి సినిమా దర్శకురాలిగా మారాలనే ఆలోచన ఉంది’. అని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. మొత్తానికి తనలో ఓ డైరెక్టర్ ఉందని,

తనకు డైరక్టర్ అవ్వాలనే ఆలోచనలు ఉన్నాయని మొహమాటం లేకుండా బయటపెట్టింది నివేత థామస్. ఇక ఈ బ్యూటీ హీరో నానిని ఎప్పుడు కలిసినా ఎక్కువగా కథల గురించి, ఆ కథలలోని పాత్రల గురించే ఎక్కువుగా మాట్లాడుకుంటామని తెలిపింది. అన్నట్టు ఈ లాక్ డౌన్ టైమ్ లో ఎక్కువుగా సినిమా మేకింగ్ పై దృష్టి పెట్టిందట.