
మహారాష్ట్రలోని వెస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ జాబ్ రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. తాత్కాలిక ప్రాతిపదికన డాక్టర్ల భర్తీ కోసం వెస్టర్న్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 33 ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. ఈ-మెయిల్ లేదా ఆఫ్‌లైన్ విధానంలో ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. మే 15 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.
http://www.westerncoal.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. మొత్తం 33 ఉద్యోగ ఖాళీలలో జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ల ఉద్యోగ ఖాళీలు 9 ఉన్నాయి. ఎంబీబీఎస్ ఉత్తీర్ణులై సంబంధిత పనిలో అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 90 వేల రూపాయల వేతనం లభిస్తుంది. స్పెషలిస్ట్ ఉద్యోగ ఖాళీలు 24 ఉన్నాయి.
జనరల్ సర్జన్, అబ్‌స్ట్రెటిక్స్ అండ్ గైనకాలజీ, పీడియాట్రీషియన్, అప్తల్మాలజిస్ట్, రేడియాలజిస్ట్, ఆర్థోపెడిక్ సర్జన్, ఈఎన్‌టి, ఫిజీషియన్ విభాగాలలో స్పెషలిస్ట్ ఖాళీలు ఉండగా ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.
అనుభవం ఉన్న ఉద్యోగులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుని భారీ వేతనం పొందవచ్చు. ఎంబీబీఎస్ చదివి సంబంధిత స్పెషలైజేషన్లలో పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణత చేసిన వాళ్లకు ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరుతుంది.