యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. భారీ వేతనంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మొత్తం 57 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కాగా 2021 సంవత్సరం జనవరి 28వ తేదీలోగా ఈ ఉద్యోగాలకు నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. https://www.upsc.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
ఈ నోటిఫికేషన్ ద్వారా యూపీఎస్సీ కేంద్ర మంత్రిత్వశాఖల్లోని వివిధ ఖాళీలను భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 57 ఉద్యోగాలలో స్పెషలిస్ట్ గ్రేడ్-3 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు 55 ఉండగా అసిస్టెంట్ డైరెక్టర్ (షిప్పింగ్) 1, అసిస్టెంట్ డైరెక్టర్ (బాలిస్టిక్స్) 1 ఉన్నాయి. స్పెషలిస్ట్ గ్రేడ్-3 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు 55 ఖాళీలు ఉండగా 40 సంవత్సరాల లోపు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.
ఎంబీబీస్ పాసైన పీజీ ఉత్తీర్ణులై మూడు సంవత్సరాల టీచింగ్ అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అసిస్టెంట్ డైరెక్టర్ (షిప్పింగ్) డిగ్రీతో మూడు సంవత్సరల అనుభవం ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. 35 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మాస్టర్స్ డిగ్రీ పాస్ కావడంతో పాటు 5 సంవత్సరాల అనుభవం ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
40 సంవత్సరాల వయస్సు లోపు అభ్యర్థులు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి అర్హత, అనుభవం ఆదారంగా వేతనం లభిస్తుంది. ఆన్‌లైన్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 25 రూపాయలు దరఖాస్తు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.