
సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. 159 పోలీస్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం యూపీఎస్సీ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. డిగ్రీ పాసైన వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండగా రాతపరీక్ష, ఫిజికల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
యూపీఎస్సీ ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. ప్రిలిమ్స్ పరీక్ష పూర్తి చేసిన వాళ్లను ఇంటర్వ్యూలకు పిలవడం జరుగుతుంది. సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఈ పరీక్ష జరగగా https://upsc.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. మొత్తం 159 ఉద్యోగ ఖాళీలలో బీఎస్ఎఫ్ 35, సీఆర్‌పీఎఫ్ 36, సీఐఎస్ఎఫ్ 67, ఐటీబీపీ 20, ఎస్ఎస్‌బీ ఒక ఉద్యోగ ఖాళీ ఉంది.
20 నుంచి 25 సంవత్సరాల లోపు వయస్సు ఉండి డిగ్రీ పాసైన వాళ్లు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ లో మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఏప్రిల్ 16వ తేదీన ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా మే 5వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉంది. జులై చివరి వారంలో ఈ ఉద్యోగాలకు సంబంధించి అడ్మిట్ కార్డులు రిలీజ్ కానున్నాయి.
https://upsc.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.