ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త.. రెండు కీలక నిర్ణయాలు..?

కరోనా మహమ్మారి విజృంభణ, లాక్ డౌన్ నిబంధనలు ఈ ఏడాది ఉద్యోగులపై కూడా తీవ్ర ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. వేగంగా వ్యాప్తి చెందిన కరోనా మహమ్మారి వల్ల లాక్ డౌన్ ను అమలు చేయడంతో దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు ప్యాకేజీలను ప్రకటించగా మోదీ సర్కార్ త్వరలో నూతన బడ్జెట్ ను సైతం ప్రవేశపెట్టనుంది. అయితే బడ్జెట్ లో ఉద్యోగులకు ప్రయోజనం చేకూరేలా కేంద్రం […]

Written By: Kusuma Aggunna, Updated On : December 26, 2020 1:18 pm
Follow us on


కరోనా మహమ్మారి విజృంభణ, లాక్ డౌన్ నిబంధనలు ఈ ఏడాది ఉద్యోగులపై కూడా తీవ్ర ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. వేగంగా వ్యాప్తి చెందిన కరోనా మహమ్మారి వల్ల లాక్ డౌన్ ను అమలు చేయడంతో దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు ప్యాకేజీలను ప్రకటించగా మోదీ సర్కార్ త్వరలో నూతన బడ్జెట్ ను సైతం ప్రవేశపెట్టనుంది. అయితే బడ్జెట్ లో ఉద్యోగులకు ప్రయోజనం చేకూరేలా కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుందని తెలుస్తోంది.

Also Read: దేశంలోని నిరుద్యోగులకు శుభవార్త.. ఆ కోర్సులు నేర్చుకునే ఛాన్స్.?

మోదీ సర్కార్ వచ్చే ఏడాది ప్రవేశపెట్టే బడ్జెట్ లో ఉద్యోగులకు ప్రయోజనం చేకూరే విధంగా ట్యాక్స్ రిబేట్ ను ప్రకటించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని బడ్జెట్ ను ప్రకటించే రోజునే ఈ నిర్ణయం అమలులోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. కేంద్రం ట్యాక్స్ రిబేట్ ప్రకటిస్తే మాత్రం ఉద్యోగులకు ఊరట కలిగించినట్లు అవుతుంది.

Also Read: పాత పీఎఫ్ అకౌంట్ లో డబ్బులు సులభంగా డ్రా చేయొచ్చు.. ఎలా అంటే..?

కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు ప్రయోజనం చేకూరేలా పన్ను మినహాయింపు ప్రయోజనాలను కూడా కల్పించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. కేంద్రం ప్రత్యక్షంగా పన్ను మినహాయింపు ప్రయోజనాలను కల్పించకపోయినా స్టాండర్డ్ డిడక్షన్‌ పరిమితిని పెంచడం ద్వారా ప్రయోజనాలను కల్పించాలని భావిస్తోంది. మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియంల విషయంలో సైతం కేంద్రం పన్ను ఉపశమనం కల్పించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

మరిన్ని వార్తలు కోసం: విద్య / ఉద్యోగాలు

ఉద్యోగులపై కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావం చూపిన నేపథ్యంలో కేంద్రం ఉద్యోగులకు అదనపు ప్రయోజనాలను కల్పించే దిశగా అడుగులు వేస్తోంది. కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.