‘పేదలందరికీ ఇళ్లు’ పథకంలో భాగంగా శుక్రవారం ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలం కొమరగిరిలో జరిగిన ఈ కార్యక్రమంలో ఇళ్ల పట్టాలకు సంబంధించిన పైలాన్ ను ఆవిష్కరించారు. జిల్లాలోని 367.58 ఎకరాల్లో 60 ఎకరాలు సామాజిక అవసరాలకు వదిలేసి 16,500 ప్లాట్లను రూపొందించారు. శనివారం నుంచి వచ్చెనెల వరకు రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 30.75 లక్షల మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నారు.