Python : 30 ఏళ్ల మహిళను మింగిన 30 అడుగుల కొండ చిలువ.. ఇండోనేషియాలో భయానక ఘటన!

Python పామును చంపి కడుపు లోపల చూడగా ఫరీదా మృతదేహం కనిపించింది. 2018లో ఆగ్నేయ సులవేసిలోని మునా పట్టణంలో ఏడు మీటర్ల కొండచిలువ 54 ఏళ్ల మహిళను మింగింది.

Written By: NARESH, Updated On : July 3, 2024 9:36 pm

indonesian-woman-was-found-dead-inside-the-belly-of-a-python-095341317-16x9_0

Follow us on

Python : ప్రపంచంలో నిత్యం ఏదో ఒక వింత జరుగుతూనే ఉంటుంది. ఇందు కొన్ని ఆహ్లాదకంరగా ఉంటే.. కొన్ని భయానకంగా ఉంటాయి. రెండు ఘటనలూ ఆశ్చర్యం కలిగిస్తాయి. తాజాగా ఓ భయానక ఘటన ఇండోనేషియాలో జరిగింది. 30 అడుగుల పొడవైన ఓ కొండచిలువ.. 30 ఏళ్ల మహిళను చంపి మింగేయాలని ప్రయత్నించింది. చివరకు పాము కూడా చనిపోయింది..

ఏం జరిగిందంటే..
ఇండోనేషియాలోని సౌత్‌ సులవెసిలో ఉన్న లువు ఏజెన్సీల ప్రాంతంలో నివసించే సిరియతి అనే మహిళక ఐదురుగు సంతానం. మహిళ తన పిల్లల్లో ఒకరికి ఆరోగ్యం బాగా లేదని మందుల కోసం మంగళవారం(జూలై 2న) ఇంటి నుంచి బయటకు వచ్చింది. నడుచుకూంటూ మందుల షాప్‌కు వెళ్తోంది. ఈ క్రమంలో అక్కడే చెట్లపై ఉన్న ఓ భారీ కొండచిలువ మహిళపై దాడిచేసింది. ఆమెను చుట్టుముటి నలిపేసింది. ఊపిరి ఆడకుండా చేయడంతో సరియతి మృతిచెందింది.

మింగేందుకు ప్రయత్నించి..
మహిళ చనిపోయిన తర్వాత కొండచిలువ ఆమెను మింగేందుకు యత్నించింది. ఈ క్రమంలో కాళ్ల వరకు మింగేసింది కూడా. ఇంతలో సిరియతి కోసం వెతుక్కుంటూ వెళ్తున్న ఆమె భర్తకు ఈ భయానక దృశ్యం కనిపించింది. కోపంతో రిసియతి భర్త కొండ చిలువను చంపేసి మహిళ మృతదేహాన్ని బయటకు తీశాడు.

నెల క్రితం కూడా..
జూన్‌ 9వ తేదీన సెంట్రల్‌ ఇండోనేషియాలో పాము కడుపులో ఒక మహిళ చనిపోయి ఉన్నట్లు గుర్తించారు. 45 ఏళ్ల ఫరీదా భర్తతో కలిసి దక్షిణ సులవేసి ప్రావిన్స్‌లోని కలెమ్‌పాంగ్‌ గ్రామంలో ఉంటోంది. జూన్‌ 8వ తేదీన ఆమెను ఐదు మీటర్ల (16 అడుగులు) కొండచిలువ మింగింది. జూన్‌ 7వ తేదీన ఆమె కనిపించకుండా పోయింది. ఆమెకోసం గాలించినా ఆచూకీ దొరకలేదు. గ్రామంలోని అటవీ ప్రాంతంలో మహిళ వస్తువులను గుర్తించారు. దీంతో సమీపంలో గాలించగా పెద్ద పొట్టతో ఉన్న 16 అడుగుల కొండచిలువ కనిపించింది. పామును చంపి కడుపు లోపల చూడగా ఫరీదా మృతదేహం కనిపించింది. 2018లో ఆగ్నేయ సులవేసిలోని మునా పట్టణంలో ఏడు మీటర్ల కొండచిలువ 54 ఏళ్ల మహిళను మింగింది.