TG EAPCET: టెన్త్, ఇంటర్, డిగ్రీ పరీక్షలు మే నెల వరకు పూర్తి కానున్నాయి. ఆయా చదువుల తర్వాత పై చదువులకు వెళ్లేందుకు విద్యార్థులకు ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో సాధించిన మార్కులు, రిజర్వేషన్ల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ఈ నేపథ్యంలో వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే సెట్‌లకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. రాష్ట్రంలో బీటెక్, బీఫార్మసీ, అగ్రికల్చర్ కోఉ్సల్లో ప్రవేశానికి నిర్వహించే ఈఏపీ సెట్(ఎప్ సెట్) దరకాస్తుల స్వీకరణ ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభం కానుంది. జేఎన్‌టీయూహెచ్‌లో సోమవారం ఎప్ సెట్‌తోపాటు పీజీఈసెట్, ఐసెట్ కమిటీల సమావేశం నిర్వహించారు. జేఎన్‌టీయూహెచ్ ఇన్‌చార్జి వీసీ, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకృష్ణారెడ్డి, విద్యా మండలి ఉపాధ్యక్షుడు పురుషోత్తం, ఎస్కే మహ్మద్, కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్, కన్వీనర్ ప్రొఫెసర్ బి.డీన్‌కుమార్, కోకన్వీనర్ ప్రొఫెసర్ విజయకుమార్‌రెడ్డి పాల్గొన్నారు. దరఖాస్తుల షెడ్యూల్‌ను ఖరారు చేశారు.
అభ్యంతరానికి రూ.500
ఈ సారి ఎప్ సెట్ సహా అన్ని ప్రవేశ పరీక్షలు ముగిసిన తర్వాత అధికారులు విడుదల చేసే ప్రాథమిక కీపై అభ్యంతరాలు తెలపాలంటే ఒక్కో ప్రశ్నకు రూ.500 ఫీజు చెల్లించాలని నిర్ణియంచారు. సదరు అభ్యంతరం సరైనదని నిపుణులు భావిస్తే ఫలితాల విడుదల చేసిన వారంలో డబ్బులు తిరిగి ఇస్తారు. జాతీయస్థాయి పరీక్షలైన జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్, నీట్ తదితర పరీక్షల్లో ఈ విధానం కొనసాగుతోంది. ఎంటెక్, ఎం ఫార్మసీ, ఎంఆర్క్ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన పీజీఈసెట్ కమిటీ సమావేశంలో సెట్ కన్వీనర్ అరుణకుమారి, కోకన్వీనర్ రవీంద్రారెడ్డి పాల్గొన్నారు. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేవానికి సంబంధించిన ఐసెట్ క మిటీ సమావేశంలో మహాత్మాగాంధీ వీసీ ప్రొఫెసర్ అల్తాఫ్ హుస్సేన్, కన్వీనర్ ప్రొఫెసర్ అలువాల రవి పాల్గొన్నారు. దరఖాస్తుల షెడ్యూల్‌ను ఖరారు చేశారు.
ముఖ్యాంశాలివీ..
– నుంచి వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు అన్ రిజర్వుడుగా ఉన్న సీట్లకు తెలంగాణతోపాటు ఏపీ విద్యార్థులు కూడా పోటీ పడుతున్నారు. అయితే విభజన జరిగి పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఆ కోటాపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. నోటిఫికేషన్ విడుదల నాటికి స్పష్టత రాకుంటే ప్రవేశాల నాటికి ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు నిర్ణయం ఉంటుందని నోటిఫికేషన్‌లో పొందుపర్చాలని కమిటీ నిర్ణయించింది.
– దివ్యాంగులకు ఉన్నత విద్యాకోర్సుల్లో 5 శాతం రిజర్వేషన్ కేటాయించాలని ఇటీవల ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇప్పటి వరకు దృష్టిలోపం, వినికిడి లోపం, మూగ, అంగవైకల్యం అనే మూడు కేటగిరీలు(ఏ, బీ, సీ)ఉండగా, 3 శాతం రిజర్వేషన్ ఉంది. కొత్తగా నాలుగో కేటగిరీ(డి)గా అటిజం చేర్చారు. ఐదో కేటగిరీ(ఈ)గా ఒకటికి మించి వైకల్యాలను చేర్చారు. ఒక్క కేటగిరీకి ఒక శాతం చొప్పన రిజర్వేషన్ ఉంటుంది. సామాజిక వర్గాల కోటాలోనే వారికి ఈ రిజర్వేషన్ వర్తింపజేస్తారు.
మూడు ప్రవేశ పరీక్షల దరఖాస్తుల షెడ్యూల్
విషయం ఎప్ సెట్ ఐ సెట్ పీజీఈ సెట్
నోటిఫికేషన్ ఫిబ్రవరి 20 మార్చి 6 మార్చి 3
దరఖాస్తుల ప్రారంభం ఫిబ్రవరి 25 మార్చి 10 మార్చి 17
ఆలస్య రుసుం
లేకుండా గడువు ఏప్రిల్ 4 మే 3 మే 19
పరీక్ష తేదీలు ఏప్రిల్ 29, 30 జూన్ 8, 9 జూన్ 16–19 వరకు
(అగ్రికల్చర్)
మే 2–5(ఇంజినీరింగ్)