Telegram CEO Pavel Durov: టెలిగ్రామ్ సీఈఓ పావెల్ దురోవ్ విద్యార్థులకు కీలక సూచనలు, సలహాలు అందించారు. భవిష్యత్తులో మంచి కంపెనీలను స్థాపించాలంటే,ప్రాజెక్టులను విజయవంతంగా నిర్వహించాలంటే వారికి ఏ సబ్జెక్ట్ మంచిదో తెలిపారు. ఎలాంటి సబ్జెక్ట్‌ను ప్రాధాన్యత ఇవ్వాలో కూడా ఆయన వెల్లడించారు. ఇంతకీ ఆయన చేసిన సూచనలు సలహాలు ఏంటి అనుకుంటున్నారా?
ఈ విషయమై ఎక్స్ వేదికగా ఓ ఆసక్తికరమైన పోస్ట్ చేశారు టెలిగ్రామ్ సీఈఓ పావెల్ దురోవ్. అంతేకాదు ఈ పోస్ట్‌పై టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ కూడా స్పందించారు. విద్యార్థులు లెక్కలపై అంటే మ్యాథమెటిక్స్‌పై ఎక్కువగా దృష్టిపెట్టాలని.. లెక్కలు తమ సొంత మేధస్సుపై ఆధారపడటాన్ని నేర్పిస్తాయి అంటూ తెలిపారు. లాజికల్‌గా ఆలోచించటం, సమస్యలను విడగొట్టి చూడటం, వాటిని దశల వారీగా పరిష్కరించడం వంటి చాలా విషయాలను లెక్కలు నేర్పిస్తాయి అన్నారు. ఏదైనా కంపెనీని స్థాపించాలన్నా, ప్రాజెక్టులను మేనేజ్ చేయాలన్నా ఇవి చాలా కీలక పాత్ర పోషిస్తాయి అని తెలిపారు కూడా.
Also Read: Male Ear Piercing: అబ్బాయిలు చెవి కుట్టించుకుంటే బెటరా? కాదా? ఏది నిజం?
పావెల్ దురోవ్ చేసిన ఈ పోస్ట్ కు అతికొద్ది సమయంలోనే వేల సంఖ్యలో లైకులు వచ్చాయి. ఈ పోస్టు నెటిజన్లను బాగా ఆకట్టుకున్నట్టుగా ఉంది. అతికొద్ది సమయంలోనే దానికి వేల సంఖ్యలో లైకులు రావడం మామూలు విషయం కాదు కద.వందల సంఖ్యలో కామెంట్లు, రీ-పోస్టులు కూడా వచ్చాయి. ఈ క్రమంలో ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ కూడా స్పందించడం విశేషం.
ఈ పోస్ట్ కు ఎలన్ మస్క్ స్పందిస్తూ లెక్కలతో పాటు ఫిజిక్స్ అంటూ కామెంట్ చేశారు. దీనికి పావెల్ కూడా స్పందించి +1 అని కామెంట్ చేశారు. అంతేకాదు ఇప్పటికే లెక్కల్లో బలంగా ఉంటే.. ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్ నేర్చుకోవడం మరింత మంచిది అంటూ రాసుకొచ్చారు. తార్కిక, సంక్లిష్టం ఆలోచనా విధానాలకు పదను పెడుతాయి లెక్కలు అన్నారు. కీలక సమస్యలను పరిష్కరిస్తాయి అంటూ పేర్కొన్నారు. అంతేకాదు భవిష్యత్తులో రానున్న కృత్రిమ మేధ యుగంలో మనిషి పాత్ర చాలా ఉంటుంది అనుకునే సమయంలో ఈయన సంభాషణ గమానార్హం అంటున్నారు కొందరు.