
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ విద్యార్థులకు తీపికబురు అందించింది. ఇంటర్ విద్యార్థుల తరగతుల నిర్వహణకు సంబంధించిన కీలక విషయాలను వెల్లడించింది. 2021 – 22 అకడమిక్ ఇయర్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఆన్ లైన్ ద్వారా క్లాసులు జరగనున్నట్టు కీలక ప్రకటించింది. టిశాట్, దూరదర్శన్ ద్వారా ఆన్ లైన్ విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించడం జరుగుతోందని తెలంగాణ ఇంటర్ బోర్డ్ పేర్కొంది.
జులై 1వ తేదీ నుంచే జనరల్, వొకేషనల్ విద్యార్థులు విద్యా సంవత్సరం కోల్పోకుండా తరగతులను ప్రారంభించనున్నట్టు తెలంగాణ ఇంటర్ బోర్డ్ వెల్లడించింది. అడ్మిషన్లు పూర్తైన తర్వాత ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కు ఆన్ లైన్ తరగతుల నిర్వహణ తేదీలను వెల్లడిస్తామని ఇంటర్ బోర్డ్ పేర్కొంది. ఇంటర్ సెకండియర్ విద్యార్థులు ఈ టైమ్ టేబుల్ ను ఫాలో కావాల్సి ఉంటుంది. దూరదర్శన్ షెడ్యూల్ జనరల్ కోర్సులను పరిశీలిస్తే ఉదయం 8:00 – 8:30 – ఫిజిక్స్, 8:30-9:00 – కెమిస్ట్రీ, 9:00-9:30 – మ్యాథ్స్ 2ఏ, 9:30-10:00 – మ్యాథ్స్ 2బి, 10:00-10:30 – బొటని(జీవశాస్త్రం) క్లాసులు జరుగుతాయి.
మధ్యాహ్నం సెషన్ లో 3:00-3:30 – కామర్స్, 3:30-4:00 – ఎకనామిక్స్, 4:00-4:30 – సివిక్స్, 4:30-5:00 – హిస్టరీ, 5:00-5:30 – లాంగ్వేజెస్, 5:30-6:00 – ఆప్షనల్ సబ్జెక్ట్స్(ఉర్దూ మీడియం) క్లాసులు జరుగుతాయి. టీశాట్ షెడ్యూల్ వొకేషనల్ కోర్సులను పరిశీలిస్తే 7:00-7:30 – MLT, 7:30-8:00 – A&T, 8:00-8:30 – ET, 8:30-9:00 – ACP క్లాసులు జరుగుతాయి. మధ్యాహ్నం సెషన్ లో 5:00-5:30 – LM&DT, 5:30-6:00 – FISH, 6:00-6:30 – SERI, 6:30-7:00 – DA, 7:00-7:30 – I&M, 7:30-8:00 – RM, 8:00-8:30 – AFT తరగతులు జరుగుతాయి.