Homeఎడ్యుకేషన్Telangana 10th results 2026: రేపే టెన్త్ ఫలితాలు..? ఈ వెబ్ సైట్ల ద్వారా చెక్...

Telangana 10th results 2026: రేపే టెన్త్ ఫలితాలు..? ఈ వెబ్ సైట్ల ద్వారా చెక్ చేసుకోండి..

Telangana 10th results 2026: తెలంగాణ పదో తరగతి (SSC) పరీక్షలు రాసిన విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫలితాల విడుదలకు సమయం దగ్గరపడింది. రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం ఫలితాల విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సమాచారం. ఈ నెల 29 లేదా 30 తేదీల్లో ఫలితాలు ప్రకటించే అవకాశముందని అధికారుల సూచనలతో అర్థమవుతోంది. అయితే అధికారిక ప్రకటన కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో పదోతరగతి ఫలితాలను ఈ క్రింది వెబ్ సైట్ల ద్వారా చూసుకోవచ్చు.

2026 మార్చి 14 నుంచి ఏప్రిల్ 13 వరకు రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో సుమారు 5.15 లక్షల మంది రెగ్యులర్ విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. అనంతరం జవాబు పత్రాల మూల్యాంకనం వేగంగా చేపట్టి ఏప్రిల్ 23 నాటికే పూర్తి చేశారు. దీంతో ఫలితాల విడుదలకు అవసరమైన సాంకేతిక ప్రక్రియలు ప్రస్తుతం తుది దశలో ఉన్నాయి.

అనుకున్న సమయానికి ఫలితాలు రిలీజ్ అయితే విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ Board of Secondary Education Telangana ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఇందుకోసం https://bse.telangana.gov.in/ ను సందర్శించి, SSC Results లింక్‌పై క్లిక్ చేసి హాల్ టికెట్ నంబర్ నమోదు చేస్తే మార్కులు, గ్రేడ్‌లు తెలుసుకోవచ్చు. ఫలితాలు విడుదలైన వెంటనే సర్వర్‌పై భారీ ట్రాఫిక్ ఉండే అవకాశం ఉన్నందున, విద్యార్థులు ఓపికగా ప్రయత్నించడం మంచిది. అధికారిక వెబ్‌సైట్‌తో పాటు, విద్యార్థుల సౌకర్యార్థం మరికొన్ని వెబ్‌సైట్లలో కూడా ఫలితాలు అందుబాటులో ఉంచుతారు. ముఖ్యంగా
results.cgg.gov.in
examresults.ts.nic.in
manabadi.co.in
schools9.com
వంటి వెబ్‌సైట్ల ద్వారా కూడా SSC ఫలితాలను సులభంగా చూసుకోవచ్చు. ఈ సైట్లలో కూడా హాల్ టికెట్ నంబర్ నమోదు చేయడం ద్వారా ఫలితాలు పొందవచ్చు.

ఫలితాలు ప్రకటించిన తరువాత విద్యార్థులు తాత్కాలిక మార్క్ మెమోను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అసలు మార్క్ మెమోలు తరువాత సంబంధిత పాఠశాలల ద్వారా అందిస్తారు. ఎవరికైనా ఫలితాలపై అనుమానాలు ఉంటే, రీకౌంటింగ్ లేదా రీవాల్యూయేషన్ కోసం అప్లై చేసే అవకాశాన్ని కూడా పరీక్షల విభాగం కల్పిస్తుంది.

తెలంగాణ SSC ఫలితాలు విడుదలైన తర్వాత విద్యార్థులు మార్క్స్ మెమో డౌన్‌లోడ్ చేసుకుని, తప్పులు ఉంటే రీవెరిఫికేషన్ లేదా రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఉత్తీర్ణులైతే ఇంటర్‌డియట్ లేదా పాలిటెక్నిక్ (TS POLYCET)అడ్మిషన్ల కోసం సిద్ధపడాలి. ఫలితాలు చూసిన వెంటనే అధికారిక సైట్ bse.telangana.gov.inలో రీకౌంటింగ్ (₹100/సబ్జెక్ట్) లేదా రీవెరిఫికేషన్ (₹600/సబ్జెక్ట్) దరఖాస్తు చేసుకోవచ్చు. మార్కులు మారితే కొత్త మెమ ఇష్యూ అవుతుంది. తగ్గితే ఒరిజినల్ సరెండర్ చేయాలి. ఫెయిల్ అయిన సబ్జెక్టులకు సప్లిమెంటరీ పరీక్షలు ఉండే అవకాశం ఉంది. పాస్ అయితే స్కూల్ నుంచి ఒరిజినల్ మీమో తీసుకోండి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Football Legends Retirement: దిగ్గజాల నిష్క్రమణ.. పుట్ బాల్ చరిత్రలో ముగిసిన స్వర్ణయుగం

Football Legends Retirement: ప్రపంచంలో అత్యధిక ఆదరణ పొందిన క్రీడ ఫుట్బాల్. అందుకే ఫిఫా ప్రపంచ కప్ కు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. పైగా ఇది క్రీడల్లోకెల్లా అత్యధిక స్థాయిలో వీక్షణలు సొంతం...

US Iran Conflict: అమెరికా డేటా సెంటర్ పై దాడి.. ముదిరిన యుద్ధం

US Iran Conflict: గల్ఫ్‌ ప్రాంతంలో అమెరికా, ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా మారాయి. రెండు దేశాలు పరస్పరం దాడులు, ప్రతీకార చర్యలతో పశ్చిమాసియా మొత్తం అగ్నిగుండంలా మారింది. వాణిజ్య నౌకల రాకపోకలకు...

FIFA World Cup Revenue: ఫిఫా ప్రపంచ కప్.. ఎన్ని వేల కోట్లు వచ్చాయో తెలుసా..

FIFA World Cup Revenue: ఈ ప్రపంచంలో అత్యంత ప్రజాధరణ పొందిన క్రీడలలో ఫుట్ బాల్ ముందు వరుసలో ఉంటుంది. దీనిని ప్రపంచంలో మెజారిటీ దేశాలు ఆడుతూ ఉంటాయి. అంతర్జాతీయ ఫుట్...

Amitabh Bachchan: ICU లో అమితాబ్ బచ్చన్.. అభిమానుల గుండెలు ఆగిపోయేలా చేస్తున్న లేటెస్ట్ పోస్ట్..

Amitabh Bachchan: 83 ఏళ్ళ వయస్సు లో కూడా వరుసగా సినిమాలు చేస్తూ , నేటి తరం యంగ్ హీరోలతో పోటీ పడుతున్న ఏకైక ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అమితాబ్...

YSRCP Land Scam: వందల కోట్ల 15.94 ఎకరాల ప్రభుత్వ భూమిని వైసీపీ నేతలకు రాసి ఇచ్చేశాడు..

YSRCP Land Scam: వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా సరే బ్రహ్మాండంగా ముక్కలు పడతాయి.. ఈ సామెతను ఆ రెవెన్యూ అధికారి నిజం చేసి చూపించారు. తనకు ఆయాచితమైన చోటు...
Oktelugu Epaper
Exit mobile version