Homeహెల్త్‌Paper Cups Health Risks: పేపర్ కప్పుల్లో కెమికల్స్.. టీ తాగితే ఏం జరుగుతుందంటే..

Paper Cups Health Risks: పేపర్ కప్పుల్లో కెమికల్స్.. టీ తాగితే ఏం జరుగుతుందంటే..

Paper Cups Health Risks: హోటళ్ల వద్దకు వెళ్లినప్పుడు గ్లాసులు పరిశుభ్రంగా లేవని పేపర్ కప్పుల్లో టీ తాగాలని చాలామంది భావిస్తూ ఉంటారు. పేపర్ కప్పుల్లో టీ లేదా కాఫీ తాగడం సేఫ్ అని చాలా మంది భావిస్తారు. కానీ ఇది పూర్తిగా నిజం కాదని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. సాధారణంగా కనిపించే ఈ పేపర్ కప్పుల లోపల ఒక పలుచని ప్లాస్టిక్ పొర (పాలిథిలీన్ కోటింగ్) ఉంటుంది. ఇది వేడి పానీయాలతో సంపర్కంలోకి వచ్చినప్పుడు కరిగి.. హానికర కణాలను విడుదల చేసే ప్రమాదం ఉంది. దీంతో పేపర్ కప్పుల్లో టీ తాగడం వల్ల ఎలాంటి హానీ జరుగుతుందో ఇప్పుడు చూద్దాం..

పేపర్ కప్పుల్లో వేడి టీ లేదా కాఫీని పోసి కొన్ని నిమిషాలు అలా ఉంచితే కప్పులకు ఉన్న ప్లాస్టిక్ పొర నుంచి మైక్రోప్లాస్టిక్స్ విడిపోతాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. 15 నిమిషాల వ్యవధిలోనే సుమారు 25,000 వరకు సూక్ష్మ ప్లాస్టిక్ కణాలు పానీయంలో కలిసే అవకాశం ఉందని పరిశోధకులు గుర్తించారు. ఇవి మన కంటికి కనిపించవు. కానీ శరీరంలోకి వెళ్లి నెమ్మదిగా ప్రభావం చూపిస్తాయి. ఇవి మాత్రమే కాదు.. పేపర్ కప్పుల తయారీలో ఉపయోగించే ఇంక్, కెమికల్స్ వల్ల సీసం (Lead), క్రోమియం (Chromium)వంటి హానికర లోహాలు కూడా ట్రేస్ స్థాయిలో పానీయాల్లోకి చేరే అవకాశముంది. ఇవి శరీరంలో చేరితే నాడీ వ్యవస్థ, కిడ్నీలు, లివర్ వంటి అవయవాలపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు.

రోజూ ఇలాంటి కప్పుల్లో టీ తాగడం అలవాటు అయితే హార్మోన్ల అసమతుల్యత (Hormonal imbalance), జీర్ణకోశ సమస్యలు, ఇమ్యూనిటీ తగ్గడం వంటి సమస్యలు వచ్చే ముప్పు ఉంది. ముఖ్యంగా పిల్లలు, గర్భిణీలు, వృద్ధులు ఇలాంటి వాటికి మరింత సున్నితంగా స్పందించే అవకాశం ఉంటుంది.

వేడి పానీయాలు సేవించాలని అనుకున్నప్పుడు పేపర్ కప్పులు కాకుండా స్టీల్ గ్లాసులు, గాజు కప్పులు లేదా సిరామిక్ కప్పులు ఉపయోగించడం ఆరోగ్యకరం. ఇవి వేడిని తట్టుకుని, ఎలాంటి హానికర పదార్థాలను విడుదల చేయవు.సౌకర్యం కోసం పేపర్ కప్పులను వాడుతున్నప్పటికీ వాటి వల్ల కలిగే దీర్ఘకాల ఆరోగ్య ప్రభావాలను గుర్తుంచుకోవాలి. చిన్న అలవాట్లలో మార్పులు చేసుకోవడం ద్వారా పెద్ద ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Football Legends Retirement: దిగ్గజాల నిష్క్రమణ.. పుట్ బాల్ చరిత్రలో ముగిసిన స్వర్ణయుగం

Football Legends Retirement: ప్రపంచంలో అత్యధిక ఆదరణ పొందిన క్రీడ ఫుట్బాల్. అందుకే ఫిఫా ప్రపంచ కప్ కు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. పైగా ఇది క్రీడల్లోకెల్లా అత్యధిక స్థాయిలో వీక్షణలు సొంతం...

US Iran Conflict: అమెరికా డేటా సెంటర్ పై దాడి.. ముదిరిన యుద్ధం

US Iran Conflict: గల్ఫ్‌ ప్రాంతంలో అమెరికా, ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా మారాయి. రెండు దేశాలు పరస్పరం దాడులు, ప్రతీకార చర్యలతో పశ్చిమాసియా మొత్తం అగ్నిగుండంలా మారింది. వాణిజ్య నౌకల రాకపోకలకు...

FIFA World Cup Revenue: ఫిఫా ప్రపంచ కప్.. ఎన్ని వేల కోట్లు వచ్చాయో తెలుసా..

FIFA World Cup Revenue: ఈ ప్రపంచంలో అత్యంత ప్రజాధరణ పొందిన క్రీడలలో ఫుట్ బాల్ ముందు వరుసలో ఉంటుంది. దీనిని ప్రపంచంలో మెజారిటీ దేశాలు ఆడుతూ ఉంటాయి. అంతర్జాతీయ ఫుట్...

Amitabh Bachchan: ICU లో అమితాబ్ బచ్చన్.. అభిమానుల గుండెలు ఆగిపోయేలా చేస్తున్న లేటెస్ట్ పోస్ట్..

Amitabh Bachchan: 83 ఏళ్ళ వయస్సు లో కూడా వరుసగా సినిమాలు చేస్తూ , నేటి తరం యంగ్ హీరోలతో పోటీ పడుతున్న ఏకైక ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అమితాబ్...

YSRCP Land Scam: వందల కోట్ల 15.94 ఎకరాల ప్రభుత్వ భూమిని వైసీపీ నేతలకు రాసి ఇచ్చేశాడు..

YSRCP Land Scam: వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా సరే బ్రహ్మాండంగా ముక్కలు పడతాయి.. ఈ సామెతను ఆ రెవెన్యూ అధికారి నిజం చేసి చూపించారు. తనకు ఆయాచితమైన చోటు...
Oktelugu Epaper
Exit mobile version