తెలంగాణ ఇంటర్ బోర్డు ఇంటర్ విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త చెప్పనుంది. గతంతో పోలిస్తే ఇంటర్ పరీక్షల్లో ఛాయిస్ మరింతగా పెరగనుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఇంటర్ ప్రశ్నల్లో అతి చిన్న ప్రశ్నలకు ఎటువంటి ఛాయిస్ లేకపోగా చిన్న ప్రశ్నలకు, పెద్ద ప్రశ్నలకు మాత్రం ఛాయిస్ ఉంది. చిన్న ప్రశ్నలలో ఏడు ప్రశ్నలకు ఐదింటికి, పెద్ద ప్రశ్నలలో ఏడు ప్రశ్నలలో ఐదింటికి గతంలో జవాబులు రాయాల్సి ఉండేది.
Also Read: సీఐఎస్ఎఫ్ లో 690 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. పూర్తి వివరాలివే..?
ఈ ఏడాది మాత్రం భిన్నంగా 10 ప్రశ్నలు ఇస్తే ఐదు ప్రశ్నలకు జవాబులు రాయాల్సి ఉంటుందని తెలుస్తోంది. కరోనా మహమ్మారి విజృంభణ, లాక్ డౌన్ నిబంధనల వల్ల విద్యార్థులకు గతంతో పోలిస్తే చాలా తక్కువ రోజులు మాత్రమే తరగతులు జరిగాయి. ఆన్ లైన్ క్లాసుల ద్వారా విద్యార్థులకు విద్యా బోధన జరిగింది. ఛాయిస్ పెంచకపోతే విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే అవకాశాలు ఉన్న నేపథ్యంలో విద్యాశాఖ ఛాయిస్ లను పెంచడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.
Also Read: పదో తరగతి విద్యార్థులకు 80 మార్కులకే పరీక్ష.. కానీ..?
2020 సంవత్సరం సెప్టెంబర్ నెల 1వ తేదీ నుంచి ఇంటర్ విద్యార్థులకు ఆన్ లైన్ ద్వారా విద్యా బోధన జరుగుతోంది. ఇంటర్ పరీక్షల నిర్వహణ గురించి ప్రకటన వెలువడాల్సి ఉండగా ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. విద్యాశాఖ హాస్టళ్ల నిర్వహణకు సంబంధించిన ప్రతిపాదనను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపినట్లు తెలుస్తోంది.
మరిన్ని వార్తలు కోసం: విద్య / ఉద్యోగాలు
మరోవైపు ఈ నెల 18వ తేదీ నుంచి ఇంటర్ విద్యార్థులకు క్లాసులు ప్రారంభం కానున్నాయి. అయితే తరగతులు రోజు తరువాత రోజు జరుగుతాయా..? లేక షిప్టు పద్ధతిలో జరుగుతాయా…? తెలియాల్సి ఉంది. మార్చి నెల చివరినాటికి పరీక్షలకు సంబంధించిన సిలబస్ పూర్తవుతుందని సమాచారం.