మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ టీచింగ్ లో అనుభవం ఉన్నవాళ్లకు అదిరిపోయే తీపికబురు అందించింది. మొత్తం 88 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి ఈ సంస్థ సిద్ధమైంది. మొత్తం 88 ఉద్యోగ ఖాళీలలో ప్రొఫెసర్లు, అసొసియేట్ ప్రొఫెసర్లు, మోడల్ స్కూల్ టీచర్ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే వాళ్లకు టీచింగ్ లో అనుభవంతో పాటు పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

కనీసం 55 శాతం మార్కులతో పీజీ, పీహెచ్‌డీ పాసైన వాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని చెప్పవచ్చు. మోడల్ స్కూల్ టీచర్ పోస్టులలో భాగంగా హెడ్ మాస్టర్, టీజీటీ, పీజీటీ, యోగా టీచర్, ప్రైవరీ టీచర్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని బోగట్టా. బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, బీఈడీ ఉత్తీర్ణత పొందిన వాళ్లు మోడల్ స్కూల్ లో టీచర్ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాలి.
ఆఫ్ లైన్ విధానంలో అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రార్, రూమ్ నెం10, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దు యూనివర్సిటీ, ఉర్దు యూనివర్సిటీ రోడ్, గచ్చిబౌలి, హైదరబాద్ 500032 అడ్రస్ కు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను పంపవచ్చు. అకడమిక్ అర్హత, పని అనుభవంను బట్టి ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
https://manuu.edu.in/ వెబ్ సైట్ లింక్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకుంటే ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు.