TCS Jobs: ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలలో ఒకటైన టీసీఎస్ ఇంజనీరింగ్ పాసైన విద్యార్థులకు అదిరిపోయే తీపికబురు అందించింది. బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్, ఎంసీఏ, ఎమ్మెస్సీ చదివిన విద్యార్థులకు ఉద్యోగాలకు సంబంధించిన ప్రకటనను రిలీజ్ చేసింది. 2019, 2020, 2021 సంవత్సరాలలో డిగ్రీ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కాగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వాళ్లకు 6 నెలల నుంచి 12 నెలల అనుభవం ఉండాలి.
28 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హతను కలిగి ఉంటారని చెప్పవచ్చు. ఆన్ లైన్ లో రిజిష్టర్ చేసుకోవడం ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడం సాధ్యమవుతుంది. టీసీఎస్ కెరీర్ పోర్టల్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 25వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీల కొరకు ఆన్ లైన్ ద్వారా రిజిష్టర్ చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.
Also Read: మంత్రి మేకపాటి మరణంపై సోషల్ మీడియాలో వదంతులు.. అసలు ఏం జరిగింది?
రిజిష్టర్ చేసుకున్న అభ్యర్థులకు రాతపరీక్షను నిర్వహించడం జరుగుతుంది. రాతపరీక్ష ద్వారా ఎంపికైన వాళ్లకు ఇంటర్వ్యూ ద్వారా తుది ఎంపిక ప్రక్రియ జరగనుంది. https://www.tcs.com/careers/tcs-digital-hiring వెబ్ సైట్ ద్వారా ఉద్యోగ ఖాళీలకు రిజిష్టర్ చేసుకోవచ్చు. ilp.support@tcs.com ఈమెయిల్ కు మెయిల్ చేయడం ద్వారా సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం అయితే ఉంటుంది.
1800 209 3111 నంబర్ ద్వారా కూడా ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకునే ఛాన్స్ ఉంటుందని చెప్పవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు భారీ మొత్తంలో వేతనం లభించనుందని సమాచారం అందుతోంది.
Also Read: గౌతం రెడ్డి హఠాన్మరణం: యువతలో గుండెపోటుకు కారణాలేంటి?
Recommended Video: