
సదరన్ రైల్వే నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. 3378 అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. పది, ఐటీఐ పాసైన వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎవరైతే ఈ ఉద్యోగాలకు ఎంపికవుతారో వాళ్లు పెరంబూర్, పొడనూర్‌లోని వర్క్‌షాప్‌లలో పని చేయాల్సి ఉంటుంది. మొత్తం ఉద్యోగ ఖాళీలలో పొడనూరులోని సిగ్నల్ అండ్ టెలికామ్ వర్క్‌షాప్‌లో 1686 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి.
జూన్ 1వ తేదీన ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. https://sr.indianrailways.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, వెల్డర్, టర్నర్, ఇతర ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. జూన్ 30వ తేదీ ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, వెల్డర్, టర్నర్ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది.
15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు 100 రూపాయలు కాగా ఆన్ లైన్ లో ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఆన్ లైన్ లోనే ఈ ఉద్యోగాల కోసం ఫీజు చెల్ల్సించాల్సి ఉంటుంది. నిరుద్యోగులకు ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది.
ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు భారీగా వేతనం లభిస్తుంది.