TS TET 2024: తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే 11,062 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. తర్వాత డీఎస్సీకి ముందు టెట్ నిర్వహించాలని విపక్షాలు, ఉపాధ్యాయ ఉద్యోగార్థుల నుంచి ఒత్తిడి రావడంతో టెట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. తాజాగా టెట్ నిర్వహణ జీవోలో మార్పులు చేయాలని నిర్ణయించింది. ఒకటి రెండు రోజుల్లో సమగ్ర నోటిఫికేషన్‌తో జీవో విడుదల చేసే అవకాశ ఉంది.
ఇప్పటికే జీవో 36
టెట్ న్విహణకు ప్రభుత్వం ఇప్పటికే జీవో 36 జారీ చేసింది. అయితే జీవోలో 1–8వ తరగతి బోధనకు కాబోయే టీచర్లకు మాత్రమే టెట్ నిర్వహిస్తామని విద్యాశాఖ పేర్కొంది. అయితే ప్రస్తుతం ఉపాధ్యాయుల పదోన్నతికి టెట్ తప్పనిసరని హైకోర్టు తీర్పు చెప్పింది. టెట్ ఉన్నవారికి మాత్రమే పదోన్నతి ఇవ్వాలని సూచించింది. దీంతో తాజాగా నిర్వహించే టెట్‌లో తమకు అవకాశం ఇవ్వాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. అయితే తాజాగా జారీ చేసిన జీవో 36లో టెట్‌నుఏటా ఒకసారి మాత్రమే నిర్వహిస్తామని తెలిపింది. దీంతో ఇదే టెట్ తాముకూడా రాసే ఛాన్స్ ఇవ్వాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.
పలు సవరణలు..
జీవో 36లో పలు సవరణలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉపాధ్యాయులకు టెట్ రాసే అవకాశం కల్పించడంతోపాటు ఏటా డిసెంబర్, జూన్‌లో టెట్ నిర్వహిస్తామని జీవోలు సవరణ చేయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన ఫైల్ ప్రస్తుతం ప్రభుత్వం పరిశీలనలో ఉంది. ఈ నేపథ్యంలో టెట్ ఇన్ఫర్మేషన్ బులిటెన్ విడుదలయ్యే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.
మార్చి 27 నుంచి దరఖాస్తుల స్వీకరణ..
ఇదిలా ఉండగా టెట్ కోసం మార్చి 27 నుంచి ఏప్రిల్ 10 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. మే 20 నుంచి జూన్ 3 వరకు టెట్ రాత పరీక్ష నిర్వహిస్తారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానంలోనే నిర్వహిస్తారు. తాజా టెట్‌తో 3 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుందని అధికారులు తెలిపారు.