https://oktelugu.com/

Jobs: నిరుద్యోగులు త్వరపడండి.. 12 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్

బ్యాంకు ఉద్యోగాలు అంటేనే క్లర్కులు, క్యాషియర్లు, మేనేజన్లు, పీవో ఉద్యోగాలు ఉంటాయి. మరి ఎస్‌బీఐ ఇంజినీర్లను నియమించనున్నట్లు ప్రకటించడంతో బ్యాంకులో ఇంజినీర్లతో పనేంటి అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Written By:
  • Raj Shekar
  • , Updated On : May 13, 2024 / 08:50 AM IST

    Jobs

    Follow us on

    Jobs: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా.. నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ముఖ్యంగా ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ఇది మరింత శుభవార్త. ఐటీ సెక్టార్‌లో లేఆఫ్‌లు కొనసాగుతున్న వేళ.. ఎస్‌బీఐ ఐటీ సెక్టార్‌లో నియామకాలు చేపట్టనున్నట్లు ప్రకటించింది. త్వరలో భర్తీ చేయబోయే 12 వేల ఉద్యోగాల్లో 85శాతం ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లతోనే భర్తీ చేయనున్నట్లు బ్యాంకు చైర్మన్‌ దినేశ్‌ ఖారా తెలిపారు. 3 వేల మంది పీవోలు, 8 వేల మంది అసోసియేట్లకు బ్యాంకిగ్‌ వ్యవహారాల్లో శిక్షణ ఇచ్చి వివిధ వ్యాపార విభాగాల్లో నియమిస్తామని వెల్లడించారు.

    ఇంజినీర్లతో ఏం పని..
    బ్యాంకు ఉద్యోగాలు అంటేనే క్లర్కులు, క్యాషియర్లు, మేనేజన్లు, పీవో ఉద్యోగాలు ఉంటాయి. మరి ఎస్‌బీఐ ఇంజినీర్లను నియమించనున్నట్లు ప్రకటించడంతో బ్యాంకులో ఇంజినీర్లతో పనేంటి అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఒకప్పటిలా కాకుండా బ్యాంకింగ్‌ సెక్టార్‌లోనూ సాంకేతికతపై ఆధారపడడం పెరిగింది. ఈ నేపథ్యంలో సాంకేతికత ఆధారంగా కస్టమర్లకు కొత్తగా ఏవిధంగా సేవలు అందించాలనే విషయంపై దృష్టి సారించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో తాజా రిక్రూట్‌మెంట్‌లో ఇంజినీర్లకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. తద్వారా బ్యాంకింగ్‌ సెక్టార్‌కు తగిన టెక్‌ మ్యాన్‌ పవర్‌ అందించడం సాధ్యమవుతుందని భావిస్తోంది.

    సాకేతికతపై ఇప్పటికే శిక్షణ..
    ఎస్‌బీఐ సాంకేతికత విషయంలో ఇప్పటికే ఇన్‌హౌన్‌ ఇనిస్ట్‌ ట్యూట్ సిబ్బందికి శిక్షణ ఇస్తోంది. ఇందుకోసం ఎక్కువ మొత్తంలో ఖర్చు చేస్తోంది. ప్రతీసారి సిబ్బందికి టెక్నాలజీలో శిక్షణ ఇవ్వడం అవసరం కావడంతో శిక్షణకు వెచ్చించడం కన్నా.. ఇంజినీర్లనే నియమించుకోవడం ఉత్తమమని భావించారు. మరోవైపు ఆర్బీఐ కూడా సాంకేతికతపై దృష్టిపెట్టింది. ఏదైనా బ్యాంకులో లోపాలను గుర్తిస్తే భారీగా జరిమానా విధిస్తోంది. ఈ నేపథ్యంలో ఐటీ ప్రొఫెషనల్స్‌ను రిక్రూట్‌ చేసుకునేందుకు ఎస్‌బీఐ నిర్ణయం తీసుకుంది.