https://oktelugu.com/

Mega Family: మెగా కుటుంబంలో చీలిక?

వాస్తవానికి రవిచంద్ర కిషోర్ రెడ్డి, అల్లు అర్జున్ మంచి స్నేహితులు. 2019 ఎన్నికల సమయంలో కూడా బన్నీ కిషోర్ రెడ్డికి మద్దతు ఇచ్చారు. ఆ ఎన్నికల్లో 30 వేల మెజారిటీతో ఆయన గెలుపొందారు.

Written By:
  • Dharma
  • , Updated On : May 13, 2024 8:59 am
    Mega Family

    Mega Family

    Follow us on

    Mega Family: మెగా కుటుంబంలో చీలిక ఉందా? అల్లు అర్జున్ విభేదిస్తున్నారా? అందుకే ఆయన వైసీపీకి మద్దతు తెలిపారా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ కు మెగా కుటుంబం నుంచి మద్దతు భారీగా ఉంది. చిరంజీవి పవన్ కళ్యాణ్ కు ఓటు వేయాలని ప్రత్యేక వీడియో విడుదల చేశారు. నాగబాబు తో పాటు వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ తేజ్ పిఠాపురంలో ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించారు. ప్రచార పర్వంలో చివరి రోజు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, చిరంజీవి భార్య సురేఖ, అల్లు అరవింద్ పిఠాపురంలో పర్యటించారు. పవన్ కు మద్దతు తెలిపారు.

    ఇలా ఓవైపు మెగా కుటుంబమంతా పవన్ కళ్యాణ్ కు అండగా నిలిచింది. రాష్ట్రంలో కూటమికి మద్దతుగా నిలవాలని మెగా అభిమానులకు సంకేతాలు పంపింది. అయితే అల్లు అర్జున్ మాత్రం భిన్న నిర్ణయాన్ని తీసుకున్నారు. నంద్యాలలో వైసీపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించారు.ఏకంగా నంద్యాల వెళ్లి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు తెలిపారు. అప్పటినుంచి మెగా కుటుంబంలో చీలిక అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. వాస్తవానికి ముందు రోజే సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ పవన్ కు మద్దతు ప్రకటించారు. రాజకీయంగా అనుకున్నది సాధించాలని ఆకాంక్షించారు. ఆ మరుసటి రోజే నంద్యాల వెళ్లి వైసీపీ అభ్యర్థికి మద్దతు తెలిపారు. అప్పటినుంచి మెగా కుటుంబం టార్గెట్ అయింది.

    వాస్తవానికి రవిచంద్ర కిషోర్ రెడ్డి, అల్లు అర్జున్ మంచి స్నేహితులు. 2019 ఎన్నికల సమయంలో కూడా బన్నీ కిషోర్ రెడ్డికి మద్దతు ఇచ్చారు. ఆ ఎన్నికల్లో 30 వేల మెజారిటీతో ఆయన గెలుపొందారు. ఇప్పుడు కూడా బన్నీని తీసుకొస్తే అడ్వాంటేజ్ అవుతుందని భావించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో బలవంతం లేదని.. తన స్నేహితుడికి శుభాకాంక్షలు చెప్పేందుకు స్వచ్ఛందంగా వచ్చినట్లు అల్లు అర్జున్ తేల్చి చెప్పాడు. అయితే అల్లు అర్జున్ తమవాడిగా వైసిపి ప్రచారం చేసుకుంటుంది. అల్లు అర్జున్ అభిమానులు వైసీపీ వైపు టర్న్ అయ్యేలా ప్లాన్ చేసింది. అయితే అల్లు అర్జున్ వైసీపీకి మద్దతు తెలిపారు అన్నది అవాస్తవం అని మెగా అభిమానులు చెబుతున్నారు. అదే జరిగితే ముందు రోజు అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కు ఎందుకు మద్దతు తెలిపారని.. అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ నేరుగా పిఠాపురం వెళ్లి పవన్ కళ్యాణ్ కు మద్దతు చెప్పలేదా? స్నేహాన్ని కూడా వైసిపి రాజకీయాలకు వాడుకుంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై చంద్రబాబు కూడా స్పందించారు. కేవలం స్నేహితుడు అయినందునే బన్నీ కలిశారని.. అతని మద్దతు జనసేనకు ఉందని.. కొంతమంది వైసీపీ సైకోలు అల్లు అర్జున్ పేరును వాడుకుంటున్నారని చంద్రబాబు విమర్శించారు. మొత్తానికైతే అల్లు అర్జున్ ను అడ్డం పెట్టుకుని మెగా కుటుంబంలో చిచ్చు పెట్టాలన్న ప్రయత్నంలో వైసిపి ఉంది. అయితే అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.