RRC ER Recruitment 2021: దేశంలోని నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా వరుస జాబ్ నోటిఫికేషన్లు రిలీజ్ అవుతుండగా తాజాగా రైల్వే శాఖ నిరుద్యోగులకు మరో తీపికబురు అందించింది. మొత్తం 2,945 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం గమనార్హం. వైర్‌మెన్, పెయింటర్, కార్పెంటర్ ఉద్యోగ ఖాళీలతో పాటు వెల్డర్, షీట్ మెటల్ వర్కర్, లైన్‌మెన్ ఉద్యోగ ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

అప్రెంటీస్ యాక్ట్-1961, అప్రెంటీస్‌షిప్ రూల్స్-1992 ప్రకారం ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. 2021 సంవత్సరం అక్టోబర్ 4వ తేదీన ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుండగా 2021 సంవత్సరం నవంబర్ 3వ తేదీ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన మెరిట్ లిస్ట్ నవంబర్ నెల 18వ తేదీన రిలీజ్ కానుంది.
వేర్వేరు ఉద్యోగ ఖాళీలకు వేర్వేరు విద్యార్హతలు ఉండగా 15 నుంచి 24 సంవత్సరాల వయస్సు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఈస్టర్న్ రైల్వేకు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ వెబ్ సైట్ ను ఓపెన్ చేసి అప్రెంటీస్ నోటిఫికేషన్ పై క్లిక్ చేయాలి. నోటిఫికేషన్ కింద ఉండే అప్లికేషన్ లింక్ పై క్లిక్ చేసి అభ్యర్థులు పూర్తి వివరాలను తెలుసుకొని దరఖాస్తు చేసుకోవాలి.
అభ్యర్థులు పూర్తి వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకొని అవసరమైన డాక్యుమెంట్లను అప్ లోడ్ చేయాలి. ఆ తర్వాత దరఖాస్తు ఫీజు చెల్లించి ఫామ్ సబ్మిట్ చేయాలి. దరఖాస్తు చేసిన ఫామ్ ను జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ఫీజు 100 రూపాయలుగా ఉంది.