Jobs: రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ నిరుద్యోగులకు తీపికబురు అందించడంతో పాటు అప్రెంటీస్‌ల ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు తాజాగా జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మొత్తం 2422 ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం గమనార్హం. rrccr.com/tradeapp/login వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2022 సంవత్సరం జనవరి 17వ తేదీన రిక్రూట్‌మెంట్ ప్రక్రియ మొదలైంది.
2022 సంవత్సరం ఫిబ్రవరి 16 ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉంది. లక్షల సంఖ్యలో నిరుద్యోగులు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవడంతో సాధారణ ఉద్యోగాలతో పోల్చి చూస్తే ఈ ఉద్యోగాలకు పోటీ ఎక్కువగానే ఉంటుందని చెప్పవచ్చు. ఇప్పటివరకు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు.
Also Read: భర్త పోయాక వివాహిత మెట్టెలు, గాజులు తీసివేయడం వెనకున్న కారణం తెలుసా..?
మొత్తం ఉద్యోగ ఖాళీలలో ముంబై క్లస్టర్‌లోని పోస్టుల సంఖ్య 1659 కాగా భుసావల్ క్లస్టర్‌లోని పోస్టుల సంఖ్య 418గా ఉంది. పూణే క్లస్టర్‌లోని పోస్టుల సంఖ్య 152 కాగా నాగ్‌పూర్ క్లస్టర్‌లోని పోస్టుల సంఖ్య 114, షోలాపూర్ క్లస్టర్‌లోని పోస్టుల సంఖ్య 79గా ఉంది. గుర్తింపు పొందిన సంస్థ నుంచి పదో తరగతి లేదా తత్సమాన అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని చెప్పవచ్చు.
15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకుంటే 50 శాతం మార్కులతో ట్రేడ్ సర్టిఫికెట్ ను కలిగి ఉండాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఐడీ లేదా పాస్ వర్డ్ తో లాగిన్ కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత అవసరమైన పత్రాలను అప్ లోడ్ చేసి దరఖాస్తు రుసుమును చెల్లించాలి. అధికారిక వెబ్ సైట్ ను సందర్శించడం ద్వారా ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవడం సాధ్యమవుతుంది.
Also Read: పక్కరాష్ట్రంలో పీవీపీ రౌడీయిజం.. ఏం ధైర్యం రాజా నీది?