Jobs: అదిలాబాద్ రిమ్స్ లో భారీగా ఉద్యోగ ఖాళీలు.. నెలకు రూ.లక్షకు పైగా వేతనంతో?

Jobs: రాజీవ్‌ గాంధీ ఇన్‌స్టిట్యూడ్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ నిరుద్యోగులకు తాజాగా తీపికబురు అందించింది. 70 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ ప్రొఫెసర్‌, సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అబ్‌స్టెట్రిక్స్‌ గైనకాలజీ, పీడియాట్రిక్స్‌, ఆర్థోపెడిక్స్‌, ఆనెస్తీషియా విభాగాలతో పాటు జనరల్‌ మెడిసిన్‌, జనరల్ సర్జరీ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మెడికల్ పీజీ డిగ్రీ […]

Written By: Navya, Updated On : April 2, 2022 9:38 am
Follow us on

Jobs: రాజీవ్‌ గాంధీ ఇన్‌స్టిట్యూడ్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ నిరుద్యోగులకు తాజాగా తీపికబురు అందించింది. 70 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ ప్రొఫెసర్‌, సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అబ్‌స్టెట్రిక్స్‌ గైనకాలజీ, పీడియాట్రిక్స్‌, ఆర్థోపెడిక్స్‌, ఆనెస్తీషియా విభాగాలతో పాటు జనరల్‌ మెడిసిన్‌, జనరల్ సర్జరీ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు.

మెడికల్ పీజీ డిగ్రీ (ఎండీ/ఎంఎస్‌/డీఎన్‌బీ)కు సంబంధించి ఉత్తీర్ణత కలిగి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ ఉద్యోగ ఖాళీలకు ఎంబీబీఎస్‌ పాసైన వాళ్లు అర్హత కలిగి ఉంటారని సమాచారం అందుతోంది. టీఎస్‌ మెడికల్‌ కౌన్సిల్‌లో రిజస్టర్‌ అయిన వాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు. 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాలి.

ఈ ఉద్యోగ ఖాళీల విషయంలో అర్హత, ఆసక్తి కలిగి ఉన్నవాళ్లు ఇంటర్వ్యూలకు నేరుగా హాజరు కావాల్సి ఉంటుంది. మెరిట్‌ మార్కులు, అనుభవం ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుందని తెలుస్తోంది. అసిస్టెంట్ ప్రొఫెసర్‌ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 1,25,000 రూపాయలు వేతనంగా లభించనుండగా సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లకు నెలకు 52,000 రూపాయలు వేతనంగా లభిస్తుంది.

2022 సంవత్సరం ఏప్రిల్ 11వ తేదీన ఈ ఇంటర్వ్యూలను నిర్వహించడం జరుగుతుంది. http://rimsadilabad.in/ లింక్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం అయితే ఉంటుందని సమాచారం అందుతోంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది.