Group1 Primary Key: గ్రూప్‌–1 ప్రైమరీ కీ విడుదల.. నాలుగు రోజులు అభ్యంతరాల స్వీకరణ

ప్రభుత్వం 563 పోస్టుల భర్తీకి గ్రూప్‌–1 నోటిషికేషన్‌ విడుదల చేసింది. ప్రిలిమ్స్‌ ముగియడంతో మెయిన్స్‌పై టీజీపీఎస్సీ దృష్టిపెట్టింది.

Written By: Dharma, Updated On : June 13, 2024 10:16 am

Group1 Primary Key

Follow us on

Group1 Primary Key: తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ జూన్‌ 9న నిర్వహించిన గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ పరీక్ష ప్రాథమిక కీని టీజీపీఎస్సీ విడుదల చేసింది. ఈ కీపై జూన్‌ 17వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరిస్తామని తెలిపింది. ప్రాథమిక కీ మాస్టర్‌ ప్రశ్నపత్రం అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్‌లో ఈనెల 13 నుంచి 17 వరకు అందుబాటులో ఉంటాయి. అభ్యర్థులు ప్రాథమిక కీ కోసం తమ వివరాలు నమోదు చేయాలి. అభ్యంతరాలను ఈనెల 17 సాయంత్రం 5 గంటల వరకు తెలియజేయాలి.

నమోదు ఇలా..
మొదట టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లోని ప్రత్యేక లింక్‌ ద్వారా ఇంగ్లిష్‌లో నమోదు చేయాలి. వాటికి తగిన రుజువులు, పుస్తక రచయిత పేరు, పుస్తకంలో జేజీ నంబర్, పత్రిక ఎడిషన్, పేజీ నంబర్, పబ్లిషర్‌ పేరు, వె»Œ సైట్‌ యూఆర్‌ఎల్‌ వివరాలు ఇవ్వాలి. ఈ మెయిన్, వ్యక్తిగత విజ్ఞాపనలు, ఇతర పద్ధతుల్లో వచ్చే, గడువు ముగిసిన తర్వాత వచ్చే అభ్యంతరాలు పరిగణనలోకి తీసుకోమని కమిషన్‌ కార్యదర్శి నవీన్‌ నికోలస్‌ తెలిపారు.

అక్టోబర్‌ 21 నుంచి మెయిన్స్‌ పరీక్ష..
ఇదిలా ఉండగా ప్రభుత్వం 563 పోస్టుల భర్తీకి గ్రూప్‌–1 నోటిషికేషన్‌ విడుదల చేసింది. ప్రిలిమ్స్‌ ముగియడంతో మెయిన్స్‌పై టీజీపీఎస్సీ దృష్టిపెట్టింది. ఈ మేరకు షెడ్యూల్‌ కూడా ప్రకటించింది. అక్టోబర్‌ 21 నుంచి 27 వరకు పరీక్షలు జరుగుతాయి. ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ భాషల్లో డిస్క్రిప్టివ్‌ విధానంలో పరీక్షలు ఉంటాయి. అభ్యర్థులు తాము ఎంపిక చేసుకున్న భాషలోనే పరీక్ష రాసే వీలు కల్పిస్తున్నట్లు టీజీఎస్‌పీఎస్సీ తెలిపింది. ఈమేరకు పరీక్షల టైంటేబల్‌ కూడా విడుదల చేసింది. ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయన వారు మాత్రమే మెయిన్స్‌ రాయడానికి అనుమతిస్తారు.