Minister Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు కేటాయించే శాఖలు ఇవే!

మంత్రులకు శాఖల కేటాయింపునకు సంబంధించి చంద్రబాబు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. చంద్రబాబు క్యాబినెట్లో జనసేనకు మూడు, బిజెపికి ఒక మంత్రి పదవి కేటాయించిన సంగతి తెలిసిందే.

Written By: Dharma, Updated On : June 13, 2024 10:02 am

Minister Pawan Kalyan

Follow us on

Minister Pawan Kalyan: ఏపీలో మంత్రుల ప్రమాణ స్వీకారం పూర్తయింది. ఇక శాఖల కేటాయింపు పైనే చర్చ నడుస్తోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కు ఏ మంత్రి పదవి ఇస్తారనేది హాట్ టాపిక్ గా మారింది. తన తరువాత అంతటి ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. క్యాబినెట్లో కీలక శాఖగా ఉన్న హోం శాఖతో పాటు డిప్యూటీ సీఎం పదవి కట్టబెడతారని ప్రచారం జరుగుతోంది. అయితే సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి కావడంతో సినిమాటోగ్రఫీ పదవి కేటాయించే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. మంత్రులకు శాఖల కేటాయింపు పై ఈరోజు ఫుల్ క్లారిటీ రానుంది. ప్రమాణ స్వీకారం అనంతరం చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుపతి వెళ్లారు. అక్కడ నుంచి వచ్చి అమరావతి లోని సచివాలయంలో బాధ్యతలు స్వీకరిస్తారు.

మంత్రులకు శాఖల కేటాయింపునకు సంబంధించి చంద్రబాబు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. చంద్రబాబు క్యాబినెట్లో జనసేనకు మూడు, బిజెపికి ఒక మంత్రి పదవి కేటాయించిన సంగతి తెలిసిందే. అయితే మిత్రపక్షలకు కీలక శాఖలు కేటాయిస్తారని తెలుస్తోంది. ఇటువంటి తరుణంలో పవన్ కు దక్కే శాఖ పైనే అందరి దృష్టి ఉంది. డిప్యూటీ సీఎం తో పాటు తగిన మంత్రి పదవి ఇవ్వాలంటే హోంశాఖ కనిపిస్తోంది. సీఎం చంద్రబాబు తర్వాత పవర్ ఫుల్ గా కనిపించాలంటే.. అన్ని శాఖలపై అజమాయిషీ ఉండే హోం శాఖ కీలకమని.. ఆ పదవి అప్పగిస్తేనే పవన్ కు న్యాయం చేసినట్లు అవుతుందని జనసైనికులు అభిప్రాయపడుతున్నారు.

కానీ పవన్ సినిమాల్లో కూడా బిజీగా ఉన్నారు. వీలైనంతవరకు సినిమాలను పూర్తి చేసి రాజకీయాలపై దృష్టి పెట్టనున్నారు. పవన్ హోం శాఖ కంటే గ్రామీణ నేపథ్యం ఉన్న శాఖని ఎక్కువగా కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. అందుకే పవన్ కు డిప్యూటీ సీఎం హోదా కట్టబెట్టడంతో పాటు పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖలను కేటాయించినట్లు తెలుస్తోంది. జనసేన లో నెంబర్ 2 గా ఉన్న నాదెండ్ల మనోహర్ కు సివిల్ సప్లై, కందుల దుర్గేష్ కు పర్యాటకం, సినిమాటోగ్రఫీ శాఖను కేటాయించనున్నట్లు సమాచారం. ఈ శాఖల కేటాయింపు పై ఈరోజు సాయంత్రానికి ఫుల్ క్లారిటీ రానుంది.