సెప్టెంబర్ 17వ తేదీన ప్రధానమంత్రి పుట్టినరోజు కానుకగా ఈ పథకం ప్రారంభమైంది. యువతకు శిక్షణ సమయంలో రైల్వే శాఖ అన్ని సౌకర్యాలు అందే విధంగా ఏర్పాట్లు చేస్తుండటం గమనార్హం. 50,000 మంది యువతకు సుమారుగా 100 గంటల పాటు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న యువత ఈ శిక్షణ పాల్గొనటానికి అర్హులు.
మొదట శిక్షణకు అర్హత ఉన్న 1,000 మందిని ఎంపిక చేస్తారు. ఈ విధంగా మూడు సంవత్సరాలలో మొత్తం 50,000 మందికి శిక్షణ ఇస్తారు. శిక్షణ పూర్తైన తర్వాత రైల్వే శిక్షణా కేంద్రాల నుంచి సర్టిఫికెట్ ను జారీ చేస్తారు. పదో తరగతి మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. శిక్షణ పూర్తైన యువత పరీక్ష రాసి రాతపరీక్షలో 55 శాతం, ప్రాక్టికల్‌లో 60 శాతం స్కోర్ చేయాల్సి ఉంటుంది.
శిక్షణ ఉచితమే అయినా ట్రైనీ వసతి, ఆహారం, ప్రయాణ ఖర్చులను భరించాలి. త్వరలో రైల్వే శాఖ దరఖాస్తు చేసుకోవడానికి వెబ్ సైట్ ద్వారా అవకాశం కల్పిస్తోంది. ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలంటే పదో తరగతి సర్టిఫికెట్, ఆధార్ కార్డ్, నివాస ధృవీకరణ పత్రం, పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, మొబైల్ నంబర్ వివరాలను అందజేయాలి.