PSB Recruitment: భారత ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఒకటైన పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. ఐటీ, రిస్క్ మేనేజర్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి తాజాగా జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 40 ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని సమాచారం. మొత్తం 40 ఉద్యోగ ఖాళీలలో 37 ఐటీ మేనేజర్ల ఉద్యోగ ఖాళీలు ఉండగా 3 రిస్క్ మేనేజర్ల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి.
కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ చదివిన వాళ్లు రిస్క్ మేనేజర్ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే కనీసం మూడు సంవత్సరాల అనుభవం ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీల కోసందరఖాస్తు చేసుకోవాలి. ఐటీ మేనేజర్ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే వాళ్లు బీఈ/ బీటెక్/ ఎంఈ/ ఎంటెక్ పాసై ఉండాలి. కనీసం 4 సంవత్సరాల అనుభవం కచ్చితంగా ఉండాలి.
25 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య అనుభవం ఉన్న వ్యక్తులు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులని చెప్పవచ్చు. ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ విధానంలో అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. డిప్యూటీ జనరల్ మేనేజర్; పంజాబ్ సింద్ బ్యాంక్, ఫిఫ్త్ ఫ్లోర్, బ్యాంక్ బౌజ్, న్యూఢిల్లీ-110008 అడ్రస్ కు దరఖాస్తులను పంపించడం ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నవంబర్ 19వ తేదీన ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా నవంబర్ 28వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకునే ఛాన్స్ ఉంటుందని చెప్పవచ్చు. https://punjabandsindbank.co.in/ వెబ్ సైట్ లో ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయి.